ఏపీలో ఈ నెల మొదటి వారంలో జిల్లాలోని 11,279 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇటీవలే ఫలితాలు కూడా విడుదల చేసి మెరిట్‌ లిస్టులను తయారు చేసింది.అందులో 71,568 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు క్వాలిఫై అయ్యారు.ఇదిలావుంటే జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని రెవెన్యూవర్గాలు తెలిపాయి.అయితే జిల్లాలో మంచి ర్యాంకులు సాధించి లోకల్‌గా ఉద్యోగాలు ఆశిస్తున్న పలువురు అభ్యర్థులకు సోమవారం ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి ఇంటర్వ్యూలకు రావాల్సిందిగా ఫోన్‌, మెయిల్‌ ఐడీలకు సందేశాలు వచ్చాయి.



ఈ ఉద్యోగాల కోసం లోకల్ లోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఆశించిన వారికి పెద్ద షాక్ తగిలింది.వారు ఆశ్చర్యపోయేలా కొందరికి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు రావాల్సిందిగా ఆదేశించారట..దీంతోపలువురు అభ్యర్ధులు అధికారులతో గొడవకు దిగారట,గుంటూరు జిల్లాలో పోస్టులు అందుబాటులో లేకపోతే తమని నాన్‌ లోకల్‌ కింద వేరే జిల్లాలకు పిలవాలని, అలాంటిది ఇక్కడ పోస్టులు పుష్కలంగా ఉన్నప్పటికీ వేరే జిల్లాలకు ఇంటర్వ్యూలకు పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మెరిట్ ర్యాంకు వున్నవారు కూడా వేరే జిల్లాకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.ఈ అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు జిల్లా అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు చెబుతున్నారు.



మెరిట్‌ లిస్టు ప్రకారం తొలుత లోకల్‌ అభ్యర్థులతో ఖాళీలు నింపి,ఆ తర్వాత నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.అసలు ఎంపిక ప్రక్రియకి సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడం సందేహాలకు తావిస్తోందని చెప్పారు. తక్షణమే ఈ గందరగోళానికి జిల్లా కలెక్టర్‌ తెరదించాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు.ఇక తమను వేరే జిల్లాలో ఇంటర్వ్యూకి పిలిపించేది అక్కడ పోస్టింగ్‌ ఇవ్వడానికా లేక కేవలం సర్టిఫికెట్ల పరిశీలన చేసి పంపడానికా అన్న విషయం తెలియక ఆందోళన చెందుతు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈ గందరగోళం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: