నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరానికి మనోహరంగా భావించిన ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఇప్పుడు  వాస్తవానికి మెట్రో తో నగర జనం  మురిసిపోయారు. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు. కానీ నిన్నటి ఘటనతో భయభ్రాంతులకు గురి అవుతున్న సందర్భం ఎదురవుతుంది. సరిగ్గా ఇదే విషయాన్నినిర్మాణ దశలోనే జ్యోతిష పండితుడు ఏ. శివ కుమార్ తన పరిజ్ఞానంతో స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రమాదం సభావిస్తుండై చెప్పారు. అప్పుడు అయన మాటలను నాతో సహా విన్నవాళ్ళు పలువురు కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు అయన చెప్పిన మాటలు వాస్తవరూపలోకి వచ్చాయి.  శాస్త్ర సాంకేతికతలో ప్రపంచ ఖ్యాతి అనే పేరున్న మెట్రో నిర్మాణ సంస్థ ప్రయాణం మొదలైన ఏడాది లోపే లోప భూయిష్టత, నాణ్యత లోపంతోనే పెచ్చులుడుతున్నాయి.



ప్రమాదంలో  ఒక మహిళ ప్రాణం మీదికి తెచ్చింది. ఈ ప్రమాదంలో ఆమె ఏకంగా అశువులు బాసింది. దానికి కారణం నిర్మాణ సంస్థ నిర్వహణ నిర్మాణం జరుగుతున్నప్పుడే లోపం జరిగి వుంటదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ తప్పిదాన్ని వక్రీకరించి వక్రభాష్యం చెపుతూ... కేవలం 9 మీటర్ల ఎత్తునుంచి మొన దేలిన కాంక్రీట్ ముక్క తలపై పడటం వల్లనే మరణం సంభవించిందని సమర్ధించు కోవటం దారుణమైన అంశంగా పరిగణించడం శోచనీయం. యిది ప్రాంభమేమో..యింకా ఎన్ని ప్రాణాలు హరీ అంటాయోనని మెట్రో వినియోగదారులతో పాటు...ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే నగరవాసులు భయానికి గురి అవుతున్నారు.



ఇలాంటి  సంఘటన మరొకటి జరగక ముందే మొత్తం మెట్రో రైలు మార్గాన్ని పూర్తిగా సాంకేతిక నిపుణులతో పరిశీలించాల్సిన  ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దిశగా  ప్రభుత్వం వెంటనే పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రాణాలు పోయాక నష్టపరిహారం పంపిణీ చేయడం కాకుండా ప్రాణాలు పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పలువురు డిమాండ్ చేస్తున్నారు.  జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేరు. కానీ అసలు నష్టమే జరగకుండా చర్యలు చేపట్ట వచ్చు...అలా అయితే ప్రాణ, ఆర్థిక నష్టాన్ని కూడా జరగకుండా ఆపొచ్చు అని ఏపీ హెరాల్డ్ అభిప్రాయపడుతోంది. ఈ అంశాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా మానవతా వాదిగా పాలకులు..అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే  నష్టాలు, కష్టాలు గణనీయంగానే జరగడానికి అవకాశమే ఇండియన్ హెరాల్డ్ గంటాపధంగా చెపుతుంది.  మరి ఆ దిశలో సంభందిత మంత్రి, అధికారులు, బాధ్యులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: