పాపం టీడీపీ అధినేత చంద్రాలుకు అన్ని ఎదురు దెబ్బ‌లే త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌ప్ప‌టి డాబు ద‌ర్పం ఇప్పుడు చంద్రాలు ద‌క్క‌క‌పోవ‌డంతో అడుగ‌డుగునా అవ‌మానాలు త‌ప్ప‌డం లేదు.. అధికార పార్టీపై ఎన్ని అబండాలు వేద్దామ‌న్నా అవి ఎటు తిరిగి మ‌ళ్ళీ అవి వెన‌క్కే వ‌చ్చి చంద్రాలుకే త‌గులుతున్నాయి. అధికారం పోయిన‌ప్ప‌టి నుంచి చంద్రాలు ప‌రిస్థితి ఎలా త‌యారైందంటే.. మూలుగుతున్న న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టుగా త‌యారైంది. ఐదేండ్లు అధికారం వెల‌గ‌బెట్టిన చంద్రాలు చేయ‌లేని ప‌నుల‌ను ఇప్పుడు అధికారం చేపట్టిన వైఎస్ జ‌గ‌న్ కూల్ గా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను అసెంబ్లీలో తూర్పార‌బ‌ట్టిన సీఎం జ‌గ‌న్ త‌రువాత అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్రమే మీడిమా ముందుకు వ‌స్తున్నారు.


ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకు దుందుడుకుగా ముందుకు సాగే యువ మంత్రుల‌ను, లౌక్యం తెలిసిన అనుభ‌వ‌జ్ఞులైన బొత్స‌లాంటి మంత్రుల చేత స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టిస్తున్నాడు. వీటికి తోడు అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్రాలు ప్ర‌భుత్వం చేసిన అవినీతిని కూడా త‌న ఎమ్మెల్యేల చేత‌, మంత్రుల చేత సీఎం జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేయిస్తూ ఉచ్చు భిగిస్తున్నాడు. ప్ర‌తిప‌క్షాలు వైసీపీ వేస్తున్న ఉచ్చుల‌కు సులువుగానే చిక్కుతున్నారు. అవినీతిని బ‌య‌ట‌పెట్టాలంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు అన‌గానే వెంట‌నే దానిపై మంత్రుల చేత విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేస్తూ ప్రతిప‌క్షాల పైకే ఉసిగొల్పి వారి అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేసే ప‌నికి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇలా బ‌స్మాసుర హ‌స్తంగా మాదిరిగా ఎవ‌రి చేతులు వారిపైనే పెట్టిస్తూ సీఎం జ‌గ‌న్ ఎత్తులు వేస్తున్నాడు. 


ఆ ఎత్తుల‌కు టీడీపీ నేత‌లు ఆవేశంతో ఊగిపోతూ మీడియా ముందుకు వ‌చ్చి అధికారం పార్టీని చెడామ‌డా తిట్టి చివ‌రాఖ‌రికి అధికార‌ పార్టీకి అస్త్రాల‌ను అందిస్తున్నారు. ఇదే అద‌నుగా అందుకుంటున్న వైసీపీ నేత‌లు చాలా తెలివిగా వాటిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ చేసిన త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునే క్ర‌మంలో వారి నేత‌లు చేసిన ఆందోళ‌న‌లు ఇప్పుడు  ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. సీఎం జ‌గ‌న్ పోల‌వరంలో అవినీతి జ‌రిగింద‌ని, రివ‌ర్స్ టెండ‌రింగ్ జ‌రుపుతాం అవినీతిని నిరూపిస్తామ‌ని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఇదే విధంగా సీఎం జ‌గ‌న్ ముందుకు పోతామ‌ని స్ప‌ష్టం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రాలు పోల‌వరంలో అస‌లు అవినీతే లేదు.. పోల‌వరం మేము క‌డుతుంటే జ‌గ‌న్ క‌ళ్ళు కుట్టి ఇలా ఆరోప‌ణలు చేస్తున్నాడ‌ని, అస‌లు రైతుల‌కు నీరంద‌కుండా జ‌గ‌న్ కుట్ర చేస్తున్నాడ‌ని, మేము చేస్తుంటే వారు అడ్డుప‌డుతున్నారని ఎదురుదాడి చేశాడు. 


అధికారం పోయిన త‌రువాత కూడా జ‌గ‌న్‌పై అవాకులు చ‌వాకులు పెలాడు. ఆయ‌న అనుచ‌రులు కూడా అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. అయితే పోల‌వరంలో అక్ర‌మాలు జ‌రుగ‌న‌ప్పుడు సీఎం జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేస్తే ఎందుకు టీడీపీ నేత‌లు స్పందించాల్సిన అవ‌సరం లేదు.. గుమ్మ‌డి కాయ దొంగ అంటూ భుజాలు త‌డుముకున్న‌ట్లుగా టీడీపీ నేత‌లు అతిగా స్పందించారు. అస‌లు అవినీతే లేద‌ని అన్నారు. అయితే ఇప్పుడు పోల‌వరంలో కేవ‌లం మూడు టెండ‌ర్ల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ చేసారు. దీంతో దాదాపుగా రూ.840కోట్ల‌కు పైగా అదా చేసారు. అంటే రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో ఇప్పుడు పెరిగిన రేట్ల ప్ర‌కారం బడ్జెట్ పెరుగాలి.. మ‌రి ఎందుకు త‌గ్గిన‌ట్లు.. అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో ఒక్క పోల‌వరం ప్రాజెక్టులోనే ఇంత నిధులు మిగ‌ల‌డంతో ఏపీ ప్ర‌జ‌లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే జ‌గ‌న్ ఆరోపిస్తున్నట్లు అవినీతి అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఇప్ప‌డు రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. 


ఇది ఏపీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూ చంద్రాలు ఆడుతున్న డ్రామాలు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయ‌నే టాక్ వినిపిస్తుంది. ఇది కేవ‌లం పోల‌వ‌రం విష‌యంలో మాత్ర‌మే.. ఇక ఇసుక రిచ్‌ల పేరుతో టీడీపీ చేసిన ఆరాచ‌కాలు అంతా ఇంతా కాద‌న్న‌ది కూడా తేలిపోయింది. ఇసుక పేరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం జ‌నాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని చంద్రాలు తెగ హ‌డావుడి చేయ‌డమే కాకుండా ధ‌ర్నాలు చేయ‌డం మ‌నం చూసాం. కానీ టీడీపీ పాల‌న‌లో జ‌రిగిన ఇసుక దోపిడి ముందు ఇప్ప‌టి ఇసుక కొర‌త పెద్ద స‌మ‌స్య కాద‌న్న‌ది జ‌నాలు అర్థ‌మ‌య్యింది. ఇసుక రేటు త‌గ్గ‌డం, ప్ర‌భుత్వ‌మే ఇసుక స‌ర‌ఫ‌రాకు ముందుకు రావ‌డంతో జ‌నాలు ఊపిరి పీల్చుకున్నారు.. కానీ టీడీపీ నేత చంద్రాలుకు మాత్రం దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించింది. కృష్ణ క‌ర‌క‌ట్ట‌పై చంద్రాలు నివ‌సిస్తున్న ఇల్లు విష‌యంలో కూడా చంద్రాలు అతిగానే స్పందించ‌డం ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తుంది. 


ఇక అమ‌రావ‌తిలో జ‌రిగిన భూదందాలో చంద్రాలు మ‌నుషులు ప్ర‌మేయం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరోపిస్తున్నారు. కాని ఈ విష‌యంలోనూ చంద్రాలు అండ్ కో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తిని త‌ర‌లించాల‌ని కుటిల పన్నాగం ప‌న్నుతుంద‌ని ఆరోపిస్తున్నారు. కానీ అమ‌రావ‌తిలో భూదందా జ‌రిగింద‌ని దీన్ని నిరూపించే ప‌నిలో ఇప్పుడు వైసీపీ స‌ర్కారు నిమ‌గ్న‌మైంద‌ట‌. ఇలా చంద్రాల‌కు ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రాలుకు అన్ని ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు.. స‌రికదా ఎదురుదెబ్బ‌ల‌ను త‌ట్టుకోలేక చంద్రాలు అండ్ కో ఏమి చేయాలో తెలియ‌క బిత్త‌ర చూపులు చూస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: