ఘజని సినిమా చూసిన వారికి అందులో లీడ్ క్యారెక్టర్ లక్షణం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పావుగంట ముందు జరిగిన సంగటనను హీరో మరచిపోతుంటారు. తాజాగా ట్విట్టర్లో రెచ్చిపోయిన నారా లోకేష్ ను చూసిన తర్వాత తాను కూడా ఘజని లాగ తయారయ్యారేమో అనే సందేహం వస్తోంది.

 

చీరాలలో జరిగిన ఓ దాడి గురించి ట్విట్టర్లో రెచ్చిపోయారు లేండి.  ఇంతకీ విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లాలోని చీరాలలో నాగార్జున రెడ్డి అనే పాత్రికేయునిపై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. మాజీ ఎంఎల్ఏ, వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ మద్దతుదారులే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారనేది అభియోగాలు. అంటే ఆ అభియోగాలు ఇంకా నిర్ధారణ కావాల్సుంది.

 

ఇదే విషయమై లోకేష్ ట్విట్టర్లో రెచ్చిపోయారు. జగన్ పాలనలో వర్షపాతం లేదుకానీ రక్తపాతం మాత్రం కొనసాగుతునే ఉందంటూ విచిత్రమైన్ కామెంట్ చేశారు. రాష్ట్రంలోని చాలా జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. కురవాల్సిన దానికన్నా ఒకటి రెండు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైతే నమోదయ్యుండచ్చు కాదనలేం. అంతేకానీ అసలు వర్షాలే కురవటం లేదన్నట్లుగా లోకేష్ కామెంట్ చేశారు.

 

ఇక రక్తపాతం గురించి మాట్లాడుదాం. నాగార్జున రెడ్డిపై దాడి చేసింది ఆమంచి మద్దతుదారులే అనుకుందాం. ఇదే నాగార్జునపై గతంలో కూడా ఇదే ఆమంచి మద్దతుదారులే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అప్పుడు ఆమంచి టిడిపిలోనే ఉన్నారు. మరి ఇదే లోకేష్ అపుడు ఎందుకు మాట్లాడలేదు ?

 

దాడి చేయటం, గాయరపచటం ఎవరు ఎప్పుడు చేసిన తప్పే. టిడిపిలో ఉన్నపుడు నాగార్జున రెడ్డి మీద దాడి చేసి గాయపరిచిన ఆమంచిని పట్టించుకోని లోకేష్ ఇపుడు మాత్రం రెచ్చిపోతున్నారు. పైగా వర్షపాతం, రక్తపాతమంటూ చాలా పెద్ద పెద్ద పదాలే వాడేస్తున్నారు. మరి ఇదే రక్తపాతం పత్తికొండలో చెఱుకులపాడు నారాయణ రెడ్డి, అనంతపురంలో ప్రసాదరెడ్డి హత్య జరిగినపుడు ఎందుకు గుర్తుకు రాలేదో ? మరి ఇదంతా చూస్తుంటే లోకేష్ మరో ఘజనీలా తయారైపోయిన అనుమానం రావటం లేదా ?

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: