పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం గురించి మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ పోలవరం ఆగిపోయిందని, పోలవరం వలన కోట్ల రూపాయలలో నష్టం వచ్చిందని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం నిర్ణయంతో రాష్ట్రానికి 780 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. టీడీపీ తమ బండారం బయట పడుతుందని, దోపీడీ వ్యవహారం అంతా బయటపడుతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కమీషన్ల కోసం చూస్తున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయం చేకూరేలా చేస్తుంటే దాని గురించి కూడా టీడీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. ఈరోజు 12.6 శాతం తక్కువ ఖర్చుతో పోలవరం నిర్మాణం జరుగుతోంటే సింగిల్ బిడ్డింగ్ ఎలా ఇస్తారని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం చెప్పిన సమయంలో పూర్తి చేస్తే తెలుగుదేశం పార్టీని మూసివేస్తారా అని మంత్రి అనిల్ అన్నారు. 
 
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు కేవలం 23 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావని మంత్రి అనిల్ అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానంలో టీడీపీ చేసి ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఖజానా మిగిలి ఉండేదని మంత్రి అనిల్ అన్నారు. ఈ వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయని ప్రశ్నించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ కు పోతే జరిగే నష్టం ఏంటో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. 
 
పోలవరం గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. రివర్స్ టెండరింగ్ విధానం వైసీపీ అమలు చేయకపోతే ఎవరి జేబులోకి వెళతాయని మంత్రి అనిల్ ప్రశ్నించారు. నవయుగ కంపెనీ బిడ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: