ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్ట్ నవంబర్ నుంచి ప్రారంభిస్తామని పదేపదే చెప్తున్నా పనులు నిలిపేశామని రగదంతం చెయ్యడం దారుణం అని అన్నారు.                               


పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కమిషన్లు కోసమే పనిచేసిందని వ్యాఖ్యానించారు మంత్రి అనిల్ కుమార్. వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేంందుకు ప్రయత్నిస్తోందని, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్లు ఆదా చేసినట్లు అయన తెలిపారు. కాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే విధంగా సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తుంటే దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అన్నారు.                    


రివర్స్ టెండరింగ్ వల్ల టీడీపీ చేసిన అవినీతి బండారం బయటపడుతుందన్న ఆందోళనతో లేనిపోని హంగామా చేస్తున్నారని, పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ను నిర్వహిస్తుంటే దానిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? టీడీపీని మూసివేస్తారా ? అంటూ ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.                                                


మరింత సమాచారం తెలుసుకోండి: