ముఖ్యంమత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి రెండో విజయం దక్కినట్లే అనిపిస్తోంది. రివర్స్ టెండర్లతో ఇప్పటికే మొదటి విజయాన్ని సాధించిన జగన్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. తాజాగా పిపిఏల సమీక్షలను చేయటానికి ప్రభుత్వానికి అన్నీ అధికారాలను ఉన్నాయని హై కోర్టు చెప్పటం మామూలు విషయం కాదు.

 

పిపిఏల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జగన్ అనుమానించారు. ఇందుకోసం సిఎం కాగానే ఓ నిపుణుల కమిటిని నియమించారు. కమిటి కూడా అన్నీ వ్యవహారాలను అధ్యయనం చేసి సుమారు రూ. 3 వేల కోట్లు అవినీతి జరిగిందని నిర్ధారించింది.

 

అందుకనే అధిక ధరలను తగ్గించేందుకు బేరసారాలడటంలో భాగంగా అప్పటి ధరలను  సమీక్షించాలని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే సమీక్షలకు హాజరుకమ్మంటూ కంపెనీలకు ప్రభుత్వం నోటిసులు కూడా పంపింది. అయితే చాలా కంపెనీలు సమీక్షలకు రాకుండా అసలు సమీక్షలు చేసే అధికారమే జగన్ కు లేదంటూ కోర్టుకెక్కాయి. మొదట్లో కోర్టు వైఖరి కూడా కంపెనీల వాదనకే మొగ్గు చూపినట్లు  అనిపించింది.

 

అయితే ఇటు ప్రభుత్వం అటు కంపెనీల వాదనలు ప్రారంభమైన తర్వాత క్రమంగా పరిస్ధితులు మారిపోయాయి. పిపిఏల సమీక్షకు ప్రభుత్వానికి అన్నీ అధికారాలున్నాయని కోర్టు ఈ రోజు అభిప్రాయపడింది.  ధరలను ఆరుమాసాల్లోగా సవరించుకోవాలంటూ కంపెనీలకు అల్టిమేటమ్ ఇచ్చింది కోర్టు. ధరలను నిర్ణయించే అధికారం ఉన్న ఏపిఈఆర్సి అధికారాల్లో తాము తల దూర్చలేమని కూడా చెప్పేసింది.

 

కోర్టు తాజా తీర్పుతో కంపెనీల వైఖరిలో కూడా మార్పు రావాల్సిందే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే వేల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు హయాంలో దోపిడి చేశాయనే విషయాన్ని ప్రభుత్వం కోర్టులో ఎస్టాబ్లిష్ చేయటంలో సక్సెస్ అయ్యింది. మార్కెట్లో కేవలం యూనిట్ ధర 2 రూపాయలకే దొరుకుతున్నపుడు 6 రూపాయలు ఎందుకివ్వాలన్నది జగన్ ప్రభుత్వ వాదన. దానికికే కోర్టు కూడా మద్దతుగా నిలబడటంతో కంపెనీలకు వేరే దారి కనబడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: