పోలవరం ప్రాజెక్టు పై అంచనాలు పెంచి పనులు చేయకుండా మూడేళ్లు కాలయాపన చేసిన ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి.ఎల్ 1గా వచ్చిన ఆ సంస్థ కోట్ చేసిన మొత్తాన్ని ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణిస్తూ రివర్స్ టెండరింగ్ కు పిలుపునిచ్చిందన్న విషయం తెలిసిందే.ఫలితంగా పోలవరం పనుల్లో అధిక వ్యయాన్ని కంట్రోల్ చేసినట్టైంది. ఇక రివర్స్ టెండరింగ్ తో దేశం చూపును తనవైపు తిప్పుకున్నారు వైయస్ జగన్.ఎన్నడూ లేని విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంచనాల పెంపుకు కళ్లెం వేసారు.ఈ రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ట్రాన్సపరెంట్ గా జరిగిన బిడ్డింగ్లో 12.6% తక్కువ కోట్ చేసి మేఘా ఇంజనీరింగ్ పోలవరం పనులను దక్కించుకుంది.



గత ప్రభుత్వం 4957 కోట్ల రూపాయిల విలువగా నిర్ణయిస్తే,ఈ పనులను 4358 కోట్ల రూపాయిలకే కోట్ చేసి ఇది అసలుసిలైన నమ్మకమైన పోటీ అనిపించుకుంది.రికార్డు టైమ్ లో పట్టిసీమ నిర్మాణం చేసి,తెలంగాణాలో భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మేఘా ఇంజనీరింగ్, కోర్టు అనుమతులు లభించిన వెంటనే పోలవరం పనులను ప్రారంభించి,ప్రభుత్వం నిర్థారించిన ప్రమాణాలన్నిటినీ పాటిస్తూ నాణ్యతలో రాజీ లేకుండా పనులను సకాలంలో పూర్తి చేసే బాధ్యతలు తీసుకుంది.ఇక ఈ పోలవరం ప్రాజెక్ట్ 2020 కల్లా పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందని,కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును రూపొందించిన అనుభవం మేఘా సంస్థకు ఉండడం కలిసొచ్చిన అంశమని తెలుస్తుంది.



ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పోలవరం విషయంలో ఎన్నో కీలక విషయాలను తెలుసుకుని,జరిగిన అవినీతి కోణాలపై సమీక్ష చేసి,పెరిగిన అంచనా వ్యయాల గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే రివర్స్ టెండరింగ్ విషయంలో పట్టుదలగా వ్యవహరించారు.ఆయన నిర్ణయం తప్పు కాదని తెలుస్తుంది.,గత ప్రభుత్వ హయాంలో పోలవరం టెండర్లు ఏకపక్షంగా నిర్ణయమయ్యాయని నేటి రివర్స్ టెండరింగ్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఇక ఇవేవి అర్ధం చేసుకొని ప్రతిపక్ష పార్టీ నేతలు కొందరు కేవలం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే పోలవరం పనులు జరిగిపోతున్నట్టు,తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.ఇకనైన అలాంటివారికి కనువిప్పుకావాలని కొందరు వైఎసార్ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: