స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ మంది ఉపయోగించే అప్లికేషన్ వాట్సాప్. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా సైబర్ నేరాలు చేయటం మొదలుపెట్టారు. నిమిషాల వ్యవధిలో మోసం చేస్తూ బ్యాంకు ఖాతాలోని డబ్బులను మాయం చేస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికల ప్రకారం పాకిస్థాన్ కు చెందిన కొంతమంది ఈ విధమైన సైబర్ నేరాలు చేస్తున్నారని తెలుస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ విషయం గురించి ఒక ప్రకటన జారీ చేసింది. 
 
సైబర్ మోసగాళ్లు కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) షో పేరుతో ఈ మోసాలు ఎక్కువగా చేస్తున్నారని తెలుస్తుంది. కేబీసీ షోలో పాల్గొనటానికి అవకాశం రావాలంటే లింక్ క్లిక్ చేయాలని మొబైల్ నంబర్లకు సందేశాలను పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేసిన తరువాత కేబీసీ లాటరీ ద్వారా డబ్బులు వచ్చాయని చెబుతారు. వీరు కేబీసీ షో నుండే మాట్లాడుతున్నామని కూడా చెబుతారు. ఆ తరువాత బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకుని బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. 
 
వాట్సాప్ గ్రూపులలో ఉన్నవారు 92 - 3077902877, 92 - 3040943299 మొబైల్ నంబర్లు గ్రూపులో ఉంటే ఆ గ్రూపు నుండి ఎగ్జిట్ కావటం మంచిది. కొన్నిసార్లు మీకు తెలియకుండానే కొందరు గ్రూపుల్లో యాడ్ చేస్తూ ఉంటారు. అపరిచితులు ఎవరూ మన మొబైల్ నంబర్ ను యాడ్ చేయకుండా ఉండాలంటే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత ప్రైవసీ బటన్ పై క్లిక్ చేసి అబౌట్ లో మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. 
 
అలా చేస్తే మీ మొబైల్ లో మీకు తెలిసిన కాంటాక్ట్స్ మాత్రమే మిమ్మల్ని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు గ్రూప్ యాడ్ చేయాలా వద్దా అనే ఇన్విటేషన్ మెసేజ్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ ను యాక్సప్ట్ చేస్తే మాత్రమే మొబైల్ నంబర్ గ్రూపులో యాడ్ అవుతుంది. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో కూడా సైబర్ మోసగాళ్లు మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా లాటరీ లేదా డబ్బులు వస్తాయని చెబితే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: