డాక్టర్ అంటే రోగులకు వైద్యం చేసి వారి ప్రాణాలు నిలబెట్టే దేవుడని అర్ధం.డాక్టర్ వృత్తి చాల గౌరవ ప్రదమైది.కాని ఆమాటకే కళంకాన్ని తెచ్చాడు ఓ డాక్టర్.కీచకుడిగా మారి తన దగ్గర పనిచేసే నర్సుపై కాంపౌండర్ అత్యాచారం చేశాడని తెలుసుకుని నిందితుడిపై చర్యలు తీసుకోకుండా తాను కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన సోదరుడితో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు..ఆ ముగ్గురు కామాంధుల చేతిలో నరకం అనుభవిస్తున్న బాధితురాలు సహనం నశించి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అరాచకం వెలుగులోకి వచ్చింది.



రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అశోక్ అనే వ్యక్తి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.పేరుకే అశోకుడు కాని పరమ కీచకుడట.తనతో పనిచేసే నర్సులపై తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడి లొంగదీసుకునేందుకు ప్రయత్నించేవాడట. అతడు ఎంత వెధవో తెలిన డాక్టర్లు కూడా ఏం అనకుండా అతడికి మద్దతు పలికేవారట.అయితే కొద్ది నెలల క్రితం అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న వివాహితపై అతడి కన్ను పడి..ఓ రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఆమెతో మాట కలిపి ఆమెకు తెలియ కుండా జ్యూస్‌లో మత్తు కలిపి  తాగమని ఇచ్చాడట.అది తాగగానే మత్తులోకి జారుకున్న ఆమెను,గదిలోకి తీసుకెళ్లి వీడియో ఆన్ చేసి అత్యాచారం చేసాడట.అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బెదిరించి అనేకసార్లు ఆస్పత్రిలో తనకోరికను తీర్చుకునే వాడట.



అలా ఒక రోజు ఆ వీడియో డాక్టర్ సురేంద్ర మహర్షి కంటపడటంతో అతడు కూడా బాధితురాలిని బెదిరించి అత్యాచారం చేయడం మొదలు పెట్టాడట.ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర సోదరుడు కూడా అనేకసార్లు ఆస్పత్రికి వచ్చి నర్సుపై లైంగిక దాడికి పాల్పడేవాడట.ఇలా సుమారు ఏడాది నుంచి ఆ ముగ్గురి కామ దాహానికి బాధితురాలు బలవ్వసాగింది.రోజు రోజుకు వారి ఆగడాలు భరించలేని స్దాయికి చేరడంతో వారి బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ధైర్యం చేసిన బాధితురాలు ఇంటికి వెళ్లి తనపై జరుగుతున్న దారుణాన్ని కుటుంబసభ్యులకు వివరించి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ ముగ్గరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇక ఈ విషయం తెలిసిన కొందరు ఈ పనేదో ముందే చేసుంటే ఇంతవరకు వచ్చేదా అని చెవులు కొరుక్కుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: