రాజకీయాల్లో గెలవాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, ఓపిక, ఒద్దిక కూడా ఉండాలి. పైగా అవసరమైన సందర్భాల్లో దూకుడుగా ఉండాలి. కాని వేళ మౌనీ బాబా అవతారం ఎత్తాలి. ఇక ప్రాంతీయ పార్టీల రాజకీయం ఒకలా ఉంటుంది. జాతీయ పార్టీల కధ వేరొకలా ఉంటుంది. ఒకచోట అలవాటు పడిన రాజకీయ దేహాలు మరో చోట అసలు ఉండలేవు. ఇక సిధ్ధాంతాలు వంటివి ఇపుడు పెద్దగా పట్టింపు లేని వ్యవహారం అయింది.



ఇదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించే. ఆయన రాజకీయ ప్రస్తానం 2006లో టీయారెస్ నుంచి మొదలైంది. ఆ తరువాత ఆయన్ని టీడీపీ చేర్చుకుంది. చంద్రబాబు రేవంత్ రెడ్డి టాలెంట్ ని బాగా వాడుకున్నారంటారు. ఓటుకు నోటు కేసు కధలో జరిగింది అదే. ఆ తరువాత రేవంత్ రెడ్డిని దూరం పెట్టినట్లుగా కనిపించింది. అయితే అతన్ని కాంగ్రెస్ లో చేర్పించింది కూడా బాబేనని చెబుతారు. ఓ విధంగా రేవంత్ కి రాజకీయ గురువు చంద్రబాబు. ఈ కారణంగానో ఏమో తెలియదు కానీ రేవంత్ ప్రతీ సందర్భంలోనూ అతి చేస్తారు. తనకు లేని హోదాను, అధికారాన్ని కోరుకుంటాడని విమర్శలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ బాగానే ఆదరించిందనుకోవాలి. ఆయనకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడినా ఎంపీగా గెలిచారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా కట్టబెట్టింది.




ఇపుడు రేవంత్ ఆశలు పీసీసీ చీఫ్ కుర్చీ మీద ఉన్నాయి. దాని కోసం ఆయన సతీసమేతంగా డిల్లీ వెళ్ళి  సోనియాగాంధీ దర్శనం చేసుకొచ్చారు. అంతవరకూ బాగానే ఉన్నా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటు కి అభ్యర్ధి విషయంలో ఆయన‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్  కుమార్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి. నిజానికి అది ఉత్తమ్ సొంత సీటు. తన భార్యను పెట్టి గెలిపించుకోవాలనుకుంటున్నారు. దానిక్ కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి వారి మద్దతు కూడా దక్కింది.



కానీ రేవంత్ మాత్రం ఎవరినో వేరే అభ్యర్ధిని సూచించడం ద్వారా వివాదాలకు తెరలేపారు. దాంతో ఎవరు అభ్యర్ధి అన్న దాని కంటే టీ కాంగ్రెస్ వ‌ర్గ పోరులో ఎవరిది పై చేయి అన్నది చర్చనీయాంశమైంది. ఈ నేపధ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిక చేసిన ఆయన సతీమణీ పద్మావతి అభ్యర్ధిత్వానికే ఓటు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సహజంగానే ఈ పరిణామం రేవంత్ కి షాక్ ఇచ్చినట్లే. 



మరింత సమాచారం తెలుసుకోండి: