కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాలు మీద జరిమానాలు పడుతున్నాయి.  కేవలం సామాన్యులకే కాదు.. ఎవరైనా సరే అతిక్రమిస్తే.. జరిమానా కట్టక తప్పదు.  ఇటీవలే ఇదే విషయాన్ని ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ముంబైలో స్పీడ్ గా ప్రయాణం చేస్తున్న నితిన్ కారుకు సైతం ఫైన్ వేశారు.  జరిమానా కట్టి వెళ్లినట్టు నితిన్ స్వయంగా పేర్కొన్నారు.  


కేవలం నితిన్ కారుకు మాత్రమే కాదు.  చాలామంది మంత్రులు, ఎంపీలకు కార్లు కూడా జరిమానాలు కట్టాయి.  చట్టం ముందు అందరు సమానమే అని చెప్పేందుకు ఇదే నిదర్శనం అని చెప్పారు.  అయితే, తెలంగాణలో కూడా ఇదే విధంగా అనేక మంది మంత్రుల వాహనాలు పరిమితికి మించి వేగంగా ప్రయాణం చేయడంతో జరిమానాలు పడ్డాయి.  ఫైన్ కు సంబంధించిన బిల్లులు సంబంధించిన మంత్రులకు పంపించినా ఇప్పటి వరకు ఆ జరిమానాలు కట్టలేదని పోలీసు శాఖ చెప్తున్నది.  


దీంతో సామాన్య ప్రజలు ఫైర్ అవుతున్నారు.  సామాన్య ప్రజలకు ఒక రూలు.. నేతలు, మంత్రులకు ఒక రూలు ఎలా ఉంటుందని, చట్టం ముందు అందరు సమానమే అని... చట్టాన్ని విధిగా పాటించాలని చెప్పే మంత్రులే ఆ రూల్స్ ను పట్టించుకోకపోతే ఎలా అని మండిపడుతున్నారు. అటు పోలీసులు కూడా ఈ విషయంలో విఐపి కార్లను చూసి చూడనట్టుగా వదిలేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.  


ఈ ఆరోపణలపై మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.  ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని పెట్టిన రూల్ ను నేతలు తప్పితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.  కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత చాలా రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా.. జరిమానాలు మాత్రం తగ్గించి వసూలు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాలు మాత్రం అమలు చేసే ఆలోచనలో ఉంటె.. బెంగాల్ మాత్రం చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేసింది.  తెలంగాణలో కూడా ఈ చట్టం అమలులో లేదు.  అయినా.. అధిక స్పీడ్ తో ప్రయాణం చేస్తే నేరం కాబట్టి జరిమానాలు విధించారు.  మరి ఈ జరిమానాలు మన మంత్రులు ఎప్పుడు కడతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: