విద్య‌ల‌కు ఆల‌యాలుగా భాసిల్లాలిన విశ్వ‌విద్యాల‌యాలు .. నేడు వివిధ విష‌యాల్లో వివాదాస్ప‌ద కేంద్రాలు గా మారిపోతున్నాయి. విషయం ఏదైనా కొన్ని కొన్ని చోట్ల అవినీతి కూడా రాజ్య‌మేలుతోంద‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. మాస్ కాపీయింగ్‌ను ప్రోత్స‌హించ‌డం, విద్యార్థుల‌ను డ‌బ్బులుతీసుకుని పాస్ చేయించ‌డం, డ‌బ్బుల‌కు డిగ్రీల‌ను అమ్ముకోవ‌డం వంటి ప‌నుల ద్వారా ప్ర‌స్తుతం ఒక‌టి రెండు యూనివ‌ర్సీటీలు చేస్తున్న ప‌నుల కార‌ణంగా అన్ని వ‌ర్సిటీల‌పైనా అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకుంటున్నాయ‌నేది వాస్త‌వం.


ఈ కోవ‌లోనే కొన్ని రోజులుగా వివాదాస్ప‌ద‌మ‌వుతున్న శ్రీవేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ కూడా వార్త‌ల్లో నిలుస్తోంది. విద్యార్థుల‌కు సంబంధించిన మూల్యాంక‌న ప్ర‌తాల విష‌యంలో మార్కులు స‌రిగా క‌ల‌ప‌కుండా చేసిన నిర్వాకంతో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకోవ‌డంతో మొద‌లు పెట్టి ఎస్వీ యూనివ‌ర్సిటీ చుట్టూ అనేక వివాదాలు చెల‌రేగుతున్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలో కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్ కింద ఈ వ‌ర్సిటీ సాంకేతిక ప‌నుల‌ను ఓ సంస్థకు అప్ప‌గించారు. అయితే, ఇక్క‌డి ఇంచార్జ్ రిజిస్ట్రార్ త‌న పెత్తనం చూపించేందుకు స‌ద‌రు సంస్థ‌ను ఇరుకున పెడుతున్నార‌నే వార్త‌లు కొన్ని రోజులుగా వెలువ‌డుతున్నాయి.


స‌ద‌రు సంస్థ వ‌ల్ల ఏదైనా పొర‌పాటు జ‌రిగి ఉంటే బాధ్య‌తా యుత‌మైన రిజిస్ట్రార్ ఆ విష‌యాన్ని స‌ద‌రు సంస్థ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించుకోవాలి. కానీ, ఇక్క‌డ ఆయ‌న త‌న పెత్త‌నం సాగించేందుకు తెర‌దీశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే సంస్థ‌కు చెందిన విక‌లాంగ ఉద్యోగిని ఏకంగా త‌న గ‌దిలోనే మూడు గంట‌ల పాటు నిర్బంధించి బ‌ల‌వంతపు సంత‌కాలు చేయించుకున్నార‌నే విష‌యం లీక్ అవ్వ‌డంతో వ‌ర్సిటీలోనూ, బ‌య‌ట‌ రాజ‌కీయంగా కూడా దుమారం రేగింది. దీనిపై ఇదేంటి సార్‌? అని ప్ర‌శ్నించిన వారిని ఆ ఇంచార్జ్ రిజిస్ట్రార్ బెదిరింపుల‌కు దిగుతున్నట్టు వ‌ర్సిటీ క్యాంప‌స్‌ల‌లో చ‌క్కెర్లు కొడుతోంది.


నేను తలచుకుంటే మీరు ఏమైపోతారో... నిముషాల్లో బ్లాక్ లిస్ట్ చేసేస్తాను అని ఈ ఇంచార్జి రిజిస్ట్రార్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇలా బెదిరింపులు చేసిన స‌ద‌రు ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ తన గేమ్ మొదలు పెట్టేసినట్లే అన్న గుస‌గుస‌లు కూడా వ‌ర్సిటీ ప‌రిధిలో వినిపిస్తున్న‌ట్టు భోగ‌ట్టా.  దాదాపు మూడు సంవత్సరాలు ఒక్క మెమో కూడా లేకుండా సేవలందించిన కంపెనీ వారిని ఏ రకంగా బ్లాక్ లిస్ట్ చేయిస్తారో వేచి చూడాల్సిందే... ఒక వేళా ఆలా ఎలా చేయించినా ఆ కంపెనీ వారు కోర్టుకు వెళితే ? యూనివర్సిటీ పరువు పోతే ? తన స్వలాభం కోసం యూనివర్సిటీ పరువును బజారు కీడ్చిన వ్యక్తి క్రింద తన పేరు మిగిలిపోదా ? అనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఈయ‌న గారిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో ?చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: