ఏపీ శాస‌న‌భ‌స మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఈనెల 16న మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే కోడెల మృతి చెంది ఇప్ప‌టికి తొమ్మిదిరోజులు పూర్త‌వుతున్న‌ప్ప‌టికి మృతికి గ‌ల కార‌ణాలు తెలియ‌క ఏపీ ప్ర‌జ‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు అయోమ‌యం అవుతున్నారు. అస‌లు కోడెల మృతిలో అనేక అనుమాన‌స్ప‌ద విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అస‌లు కోడెల  ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు, పోలీసులు నిర్థారించారు. కానీ ఎందుకో ఈ కేసుపై అంద‌రికి అనుమానాలు క‌లుగుతూనే ఉన్నాయి. కోడెల అల్లుడు మాత్రం ఇది ఆత్మ‌హ‌త్య కాదు.. కోడెల కొడుకే చంపాడ‌ని ఆరోపించారు. అంతే కాదు కోడెల  శివప్రసాద్ ఆత్మహత్యపై  సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయ‌డం, దాన్ని కోర్టు కొట్టివేయడం జ‌రిగింది.


అయితే ఏపీ మాజీ స్పీక‌ర్  కోడెల మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తూనే ఉన్నాడు. ఏపీ ప్ర‌భుత్వం దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆరోపిస్తున్నాడు. కోడెల మృతికి కేవ‌లం సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రే కార‌ణం. కేవ‌లం ల‌క్ష రూపాయ‌ల ప‌ర్నిచ‌ర్‌కే ఇలా వేధింపులకు పాల్ప‌డి 11కేసులు న‌మోదు చేస్తారా.. అంటూ చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోసాడు. ఏకంగా కోడెల శ‌వ‌యాత్ర రోజున చంద్రబాబు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. శ‌వ‌యాత్ర‌కు కాస్త వైసీపీ ప్ర‌భుత్వంపై ఓ యుద్ధ‌మే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు చంద్ర‌బాబు.


అయితే ఇక్క‌డ చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించి తీరుకూడా అనేక విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశ‌మిచ్చింది. చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల‌ను చూసి ఆనందంతో ఊగిపోతూ విక్ట‌రీ సంకేతాలు చూప‌డం ప‌ట్ల స‌భ్య స‌మాజం చంద్ర‌బాబు వైఖ‌రిపై దుమ్మెత్తి పోసారు. కోడెల మృతితో చంద్రబాబు వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకు పెట్టిన‌ట్లుగా ఈ విక్ట‌రీ సంకేతాలు చూపాడ‌ని, చంద్ర‌బాబు శ‌వ‌రాజ‌కీయాలు ఎలా చేస్తాడో ఈ ఉదంతం తేట‌తెల్లం చేసింది. అయితే కోడెల మృతిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని దుమ్మెత్తి పోసిన చంద్రబాబు ఇప్పుడు గ‌మ్మున ఊరుకున్నాడు. అస‌లు కోడెల మృతికి కుటుంబ స‌భ్యుల వేధింపులే కార‌ణ‌మ‌నే సంకేతాలు వెలువ‌డుతున్న త‌రుణంలో చంద్ర‌బాబుకు ఏమీ పాలుపోవ‌డం లేదు.


కోడెల తెలంగాణ‌లో ఆత్య‌హ‌త్య చేసుకున్నాడు.. అదే క‌నుక ఏపీలో ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ఇప్ప‌టికే జ‌గన్ ప్ర‌భుత్వంపై ఓ యుద్ధ‌మే చేసేవాడు. అయితే ఇప్పుడు కోడెల ఆత్మ‌హ‌త్య‌లో అనేక కోణాలు బ‌య‌టికి రావాలంటే కుటుంబ స‌భ్యుల‌ను విచారించాల‌ని తెలంగాణ పోలీసులు నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యంలో భాగంగా తెలంగాణ పోలీసులు కోడెల కుమారుడు శివ‌రాంకు నోటీసులు అందిచార‌ట‌. అయితే కోడెల 11వ రోజు కార్య‌క్ర‌మం పూర్తి అయిన త‌రువాత విచార‌ణ‌కు వ‌స్తాన‌ని అన్నార‌ట‌. దీనికి తోడు కోడెల మృతిచెందిన నాటి నుంచి ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా వాడిన సెల్ ఫోన్ క‌నిపించ‌డం లేద‌ట‌. ఈ సెల్‌ఫోన్ దొరికితే త‌ప్ప అస‌లు విష‌యాలు వెలుగులోకి రావ‌ట‌.


కోడెల మృతిలో కుటుంబ స‌భ్యులే కార‌ణ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేద‌ట. కోడెల ఆ సెల్‌ఫోన్‌లో ఎవ‌రితో మాట్లాడాడో, ఏమ‌ని మాట్లాడాడో  తేలిపోతుందట‌. అయితే ఈ సెల్‌ఫోన్ దొర‌కకుండా కుటుంబ స‌భ్యులే జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌.. సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఈకేసుపై కూఫీ లాగితే కాని అస‌లు విష‌యాలు బ‌య‌టికి రావు. ఇక కోడెల కుమారుడిని, కుటుంబ స‌భ్యుల‌ను విచారిస్తే త‌ప్ప అస‌లు కోడెల మృతి ఎలా జ‌రిగిందో బ‌య‌టికి రావ‌ట‌. సో కోడెల సెల్‌ఫోన్ ఎప్పుడు దొరుకుతుందో.. కోడెల కుటుంబ నుంచి ఎలాంటి విష‌యాలు బ‌య‌టికి వ‌స్తాయో.. వైసీపీ ప్ర‌భుత్వంకు ఎలాంటి లింకైనా ఉందో తేలిపోతుందట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: