జర్నలిస్టుల సమస్యలపై దశల వారి పోరాటానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సంసిద్ధమైంది. ఏ క్రమంలో ఈ    నెల26న తహిసిల్ధార్ కార్యాలయాల ముందు ధర్నాచేపట్టనున్నారు. అదే విధంగా వచ్చే నెల 4న ఆర్డీవో ఆఫీస్ ల వద్ద పికెటింగ్ నిర్వహించనున్నారు. వచ్చెనెల 14న జిల్లా కలెక్టరేట్ ముట్టడించనున్నారు. ఈ  మేరకు టియుడబ్ల్యుజె (ఐజెయు)నేతల వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యలపై దశలవారి పోరాటాలకు టియు డబ్ల్యుజె (ఐజెయు) పిలుపునిచ్చినట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాం నారాయణ,జిల్లా అధ్యక్షులు నర్వనేన వెంకట్రావు తెలిపారు.మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడ్తూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జర్నలిస్టుల బ్రతుకులు దుర్బరం అయ్యాయని జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను నెరవేర్చడం లో విఫలం అయ్యారన్నారు.



వరంగల్,నిజమాబాద్ వంటి జిల్లాలో ముఖ్యమంత్రి కెసి ఆర్ స్వయంగా ఎన్నో హామిలు ఇచ్చారని కాని ఆరేళ్ళకాలంలో ఒక హామి ని కూడా నెరవేర్చలేదన్నారు.ఇటివల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా జర్నలిస్టుల సంక్షేమంపై అనేక అవస్తవాలను ప్రకటించారని వారు చెప్పారు.కొన్ని జిల్లాలో ఇళ్ళ స్ధలాలను ఇచ్చామని చెబుతూనే మరికొన్ని జిల్లాలో సుఫ్రిం కోర్టు వల్ల ఇవ్వలేకపోయామని ప్రకటించి సభను ప్రకదొవపట్టించారని వారు అన్నారు.తెలంగాణ రాక ముందు అక్రిడేషన్లు అందరికి అందాయని ఇప్పుడు మాత్రం ఎబిసిడిలుగా వర్గికరించారని, హెల్త్ కార్డు ఎక్కడ పనిచేయడం లేదని వారు అన్నారు. జర్నలిస్టలు ఇళ్ళ స్ధలాలతోపాటు అందరికి అక్రిడేషన్లు,హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తొలి దశగా ఈనెల26న అన్ని మండల కేంద్రాల్లోని తహసిల్ధార్ కార్యాలయాల ముంధు ధర్నా చేయనున్నామని వారు చెప్పారు. 




అప్పటికి ప్రభుత్వం దిగిరాక పోతే వచ్చే నెల 4న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ముందు పికెటింగ్ చేస్తామని అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించపోతే అక్టోబర్ 14న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. తొలి దశగా ఈనెల 26న మండల తహసిల్ధార్ కార్యాలయల ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యూనియన్లకు అతీతంగా జరిగే ఆందోళనలో జర్నలిస్టులంతా పాల్గొన్నాలని వారు కోరారు. తమ పోరాటానికి అన్ని రాజకీయపార్టీలు,ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని వారు విజ్ణప్తి చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వర్ రావు,నేషనల్ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర శేషు,ఎలక్ర్టానిక్ మిడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కుర్రాకుల గోపి,జిల్లా కోశాధికారి జనార్దన్ చారి,నగర కన్వీనర్ మైస పాపారావు ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం వెంకటేశ్వర్లు,ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: