ప్ర‌పంచం అంతా ఒక ట్రెండు....తెలంగాణ‌లో ఇంకో ట్రెండ్ అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉందంటున్నారు నిపుణులు.... ప్ర‌పంచ‌వ్యాప్తంగా.... ఆర్థికమాంద్యం ప్రతికూల ప్రభావం అన్నిరంగాలపై పడిన నేపథ్యంలో దేశంలోని అధికశాతం రాష్ర్టాల్లో స్థిరాస్తిరంగం (రియల్ ఎస్టేట్) తీవ్ర మందగమనంలో ఉండ‌గా.... ఇంకా చెప్పాలంటే... రాష్ర్టాల్లో రియల్‌రంగం మైనస్‌లోకి జారుకుంటే.. మరికొన్నిచోట్ల స్థిరాస్తిరంగం ఢమాల్‌మన్నది. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటున్నారు. ప్రతికూల పరిస్థితులలోనూ ఇక్కడి రియల్‌రంగంలో జోరు కొనసాగుతుండటం దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.


తాజా సమాచారం ప్రకారం....ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రంలోని ఇతరరంగాలపై ఉన్నా స్థిరాస్తి రాబడిలో మాత్రం వేగం.... తగ్గలేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో వృద్ధిరేటు 6% లోపే ఉన్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఇక తమిళనాడు, కేరళ వంటి రాష్ర్టాల్లో వృద్ధిరేటు మైనస్‌లో ఉన్నది. దేశమంతటా ఇదే పరిస్థితి అని రియల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ.... తెలంగాణ‌లో మ‌త్రం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రఖజానాకు తాజా లెక్కల ప్రకారం దాదాపు రూ.3,400 కోట్లు చేరాయి. ఏప్రిల్ నుంచి కేవలం ఐదు నెలలలోనే బడ్జెట్ లక్ష్యంలో సగానికి పైగా దాటింది. గత ఆర్థికసంవత్సరం 12 నెలల్లో మొత్తం రాబడి రూ.6612 కోట్లు కాగా ఈసారి అతి తక్కువకాలంలోనే రూ.3,400 కోట్ల వరకు రాబడి సమకూరడం విశేషం. గత ఏడాది 27.73% వృద్ధిరేటు నమోదు కాగా ఈ ఆర్థికసంవత్సరం ఇప్పటికే వృద్ధిరేటు 17% దాటింది.  


స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి తెలంగాణ  రాష్ట్రంలో నెలనెలకు భారీగా పెరుగుతున్నది. ఈ ఆర్థికసంవత్సరం మొదటి ఐదునెలల్లో రాష్ట్రం రియల్ ఆదాయంలో గణనీయంగా వృద్ధిని సాధించిందని వెల్లడైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రూ.2,300 కోట్ల వరకు రాబడి రాగా, ఈసారి ఎకాఎకిన అది దాదాపు రూ.2,800 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ రెండోవారానికి అది రూ.3,400 కోట్ల మార్క్ దాటింది. ఎప్పటిలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి దాదాపు 60% ఆదాయం ఖజనాకు జమైంది. గత ఏడాది ఆగస్టు వరకు 6,17,498 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా ఈసారి అదే సమయానికి 7,30,728 డాక్యుమెంట్లు రిజిస్టర్ కావడం విశేషం. గత ఏడాది ఐదు నెలల్లో.. అంటే ఆగస్టు నెలాఖరు వరకు రూ.2.40 వేల కోట్ల వరకు రాబడి రాగా ఈసారి అదే సమయానికి రాబడి రూ.2.72 వేల కోట్లు దాటింది. ఈసారి కూడా అత్యధిక డాక్యుమెంట్లు రంగారెడ్డి జిల్లాలోనే రిజిస్టర్ అయ్యాయి. ఈ జిల్లాలో 1,53,639 స్థిరాస్తి దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా వేయి కోట్ల రూపాయలకు పైగా రాబడి వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరిలో 71,199 డాక్యుమెంట్ల ద్వారా సుమారు రూ.500 కోట్ల రాబడి వచ్చింది. తర్వాతి స్థానాన్ని మెదక్ జిల్లా ఆక్రమించింది.
మెదక్ జిల్లాలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం గత రెండేండ్లుగా బాగా పుంజుకున్నది. ఈ జిల్లాలో డాక్యుమెంట్లు మేడ్చల్ జిల్లా కంటే ఎక్కువగా.. 84,580 వరకు రిజిస్ట్రేషన్ కాగా రూ.254కోట్ల వరకు రాబడి వచ్చింది. మహబూబ్‌నగర్‌లో 83.087 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రాబడి దాదాపు రూ.8 కోట్ల వరకు సమకూరింది. ఇక హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ రిజిస్ట్రేషన్ జిల్లాలలో ఎప్పటిలాగే డాక్యుమెంట్లు పరిమితంగా ఉన్నా రాబడి మాత్రం రూ.40 కోట్ల వరకు సమకూరింది. రంగారెడ్డి జిల్లాలో 1,41,744 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా సుమారు రూ.830 కోట్ల రాబడి వచ్చింది. ఇది మొత్తం రాబడిలో 35.12 శాతంగా ఉన్నది. మేడ్చల్ జిల్లాలో 72,461 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా దాదాపు రూ.530 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు రూ.195 కోట్ల రాబడి సాధించి మెదక్ మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన మరుసటి సంవత్సరం నుంచే రియల్ ర్యాలీ కొనసాగుతున్నది. వాస్తవానికి 2003లో భూముల విలువ పెంచిన తర్వాత ఇప్పటివరకు రివిజన్ జరుగలేదు. ప్రజలపై రిజిస్ట్రేషన్ రుసుం భారం పెరుగకుండా స్టాంప్ డ్యూటీని పెంచలేదు. అయినప్పటికీ రాబడిలో ఏయేటికాయేడు గణనీయవృద్ధి చోటుచేసుకుంటున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: