అందమైన ప్రకృతిలో అద్భుతాలెన్నెన్నో.గమనించాలే కానీ ప్రతీదీ ఒక రహస్యమే.ఆ రహస్యాలను చేధించేందుకే మనిషి తన మేధస్సును పదునెక్కించి..శతవిధాల ప్రయత్నిస్తున్నాకానీ మానవ మేధకు అందని అపూర్వమైన మిస్టరీలు కొన్ని అలాగే మిగిలిపోయాయి.అలా వెలుగు చూసిందే రోగాలు నయం చేసే నీటి మిష్టరి,ఈ సెలయేరులో స్నానం చేస్తే సర్వరోగ నివారణ జరిగి,ఆరోగ్య వంతులవుతారనే నమ్మకంతో ఎందరో ఈ నీటిలో స్నానంచేసి,వాటిని తాగుచున్నారట..ఇంతకు ఆనది ఎక్కడుందో, తెలుసుకుందాం రండి! 



వేడినీటి చెలమలు,చల్లని నీటి చెలమల గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల భూమిలోంచి వేడినీరు ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వతశ్రేణిలో ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌ అనే ప్రాంతం ఉంది...ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయట.ఇప్పటికి చాలామంది స్నానాలు చేస్తూ తమ వ్యాధులు నయం చేసుకుంటున్నారు.ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక తెగల ప్రజలు పరమపవిత్రంగా భావించేవారు.ఈ ప్రాంతంలో స్నానం చేసేవారు.ఇందులో నిత్యం 143 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎనిమిది లక్షల గాలన్ల నీరు బైటకు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎందుకు అలా వెలువడుతుందన్న విషయం ఇప్పటివరకు అంతుచిక్కలేదు. ఎటువంటి జియోథర్మల్‌ యాక్టివిటీ లేకుండా నాలుగు వేల సంవత్సరాలుగా భూగర్భ పొరల్లోంచి నిరంతరాయంగా ఆ నీరు వెలువడుతోంది. అది కూడా వడబోసిన నీరంత స్వచ్ఛంగా ఉంటుందట.



ఇక్కడికి దగ్గరలోనే, చల్లని నీటి గుండం కూడా ఉంది. దీన్ని ముద్దుగా స్లీపింగ్‌ వాటర్స్‌ అని పిలుచుకుంటారు. నాటి కాలం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అదే పేరుతో పిలవబడుతోంది. ఇలా ఒక పక్కన వేడి నీళ్లు ఉబికి రావడం, మరో పక్క చల్లని నీటి సెలయేరు ఉండడం ఈ రెండూ రోగాల్ని నయం చేయడం అంతా ఒక మిస్టరీ..ఇప్పటి వరకు ఈ మిస్టరీ ఏమిటో ఎవరూ కనిపెట్టలేకపోయారు.మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే ఎంతో అరుదైన అరవై రకాల ఖనిజాలు దీనికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో,కిలోమీటర్‌ వ్యాసార్థంలో విస్తరించి ఉన్నాయట.



ఈ విధంగా ఈ ప్రాంతం మాగ్నెటిక్‌ కేవ్‌గా మిస్టరీకి ఆలవాలమైపోయింది..ఈ హీలింగ్‌ వాటర్‌లో పవిత్రస్నానాలు ఆచరించే వారు..ఈ నీరు తాగినా, ఇందులో స్నానం చేసినా ఎటు వంటి వ్యాధులెైనా పూర్తిగా నయమవుతాయని ప్రజల విశ్వా సం..ఇక భూగర్భ పరిశోధకులు ఎంతగా పరిశీలించిన ఈ నీటి రహస్యాన్ని చేధించలేకపోయారు..ఇలా ఒక పక్కన వేడి నీళ్ళు ఉబికి రావడం,మరోపక్క చల్లని నీటి సెలయేరు ఉండటం,ఇవి రోగాల్ని నయంచేయడం, అంతా ఒక మిస్టరీయే కదా..అందుకే ప్రాంతం ‘హాట్‌ స్ప్రింగ్‌ నేషనల్‌ పార్క్‌గా పిలవబడుతుందట...


మరింత సమాచారం తెలుసుకోండి: