ఉల్లి ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. అది ప్రాంతాన్ని బట్టి కిలో రూ.50 నుంచి రూ.80 వరకు ఉన్నాయి.ఇక ఢిల్లీ తదితర మార్కెట్లో కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ఉండగా,హైదరాబాద్ మార్కెట్లో రూ.50 వరకు ఉంది.ఎందుకు ఇలా అంటే ఈసారి తక్కువ విస్తీర్ణంలో పంటకు తోడు వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పంట నీట మునిగింది. దీంతో తగినంత సరఫరా లేదని అందుకే ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని  చెబుతున్నారు.ఇక ఇప్పుడు ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పలు రాష్ట్రాల్లో ఉంచిన నిల్వలను డిమాండును బట్టి ఆయా ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.ఇందుకోసం ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వలపై పరిమితి విధించాలని యోచిస్తోందని చెబుతున్నారు.



అలాగే,ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు కనీస ఎగుమతి ధరనుపెంచి.ఎగుమతి ప్రోత్సాహకాలను ఉపసంహరించింది.ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులు తగ్గుతున్నాయి.ఇక ఢిల్లీ వంటి పలుప్రాంతాల్లో ఉల్లి వినియోగదారుల కంటనీరు తెప్పిస్తోంది.ఈ నేపథ్యంలో నాఫెడ్,ఎన్‌సీసీఎఫ్,మదర్ డైరీల ద్వారా కిలో రూ.22 నుంచి రూ.24కు విక్రయించేలా ఏర్పాట్లు చేసింది.సరఫరాను మెరుగుపరిచి ధరలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు గత కొన్నివారాలుగా కేంద్రం చర్యలు చేపట్టిందని,అయితే ప్రధానంగా ఉల్లిసాగు చేసే రాష్ట్రాల్లో భారీవర్షాలు కురువడంవల్ల గత రెండు మూడురోజుల్లో ఉల్లిధరలు అమాంతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఉల్లిని ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,గుజరాత్,తూర్పు రాజస్థాన్,పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్న కార్ణంగా  ఉల్లి ధరలు పెరిగాయి.



ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలకు కోత వేయడం, కనీస ఎగుమతి ధర పెంపు ద్వారా ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులకు చెక్ పెడుతోంది. అయితే దేశంలో తగినన్ని ఉల్లి నిల్వలు ఉన్నాయని, వర్షాకాలం కారణంగా వాటి సరఫరా నిలిచిపోయిందని,దీంతో మార్కెట్లో ధరలకు రెక్కలు వచ్చాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉంచిన ఉల్లిని విక్రయిస్తున్నామని, వర్షాకాల పంట దిగుబడులు నవంబర్ నెల మధ్య నుంచి మార్కెట్‌కు చేరుకుంటాయని అప్పుడు మరింతగా ఉల్లి ధరలు తగ్గుతాయంటున్నారు....


మరింత సమాచారం తెలుసుకోండి: