పెద్ద పెద్ద చెరువులు కుంటలు చూడాలంటే ఎక్కడికొ  వెళ్లవలసిన అవసరం లేదు. వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ నగరానికి వస్తే చాలు   రోడ్లన్నీ జలమయమయి  పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితి అలాగే ఉంది సోమవారం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 

సోమవారం నుండి కురుస్తున్న వర్షానికి ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. సోమవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండగా ... హైదరాబాద్ లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన దారులు జలమయం అయినా రహదారులు గుండా ప్రయాణించేందుకు  తీవ్ర ఇక్కట్లు ఎదురుకున్నారు. 

 

 

నాళాలు ఉప్పొంగడంతో వరదనీరు రోడ్లపైకి చేరి చెరువులను తలపిస్తున్న రోడ్ల  పై వాహనదారులు కదల్లేక మెదల్లేక ఇరుక్కుపోయారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహన దారుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. నగరంలో పరిస్థితిని దృశ్య  ఎమర్జెన్సీ బృందాలు, రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దింపి వరద నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. కాగా ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: