హాస్పిటల్ లో డాక్టర్లు రోగులు ఉంటారు.  డాక్టర్లు రోగులకు వైద్యం చేస్తుంటారు. ఒక్కోసారి సీరియస్ కేసులు కూడా వస్తుంటాయి.  అలా సీరియస్ కేసుల్లో కొందరు మరణిస్తుంటారు.  ఇది సహజమే.  పుట్టిన వాడు మరణించక తప్పదు.. మరణించిన వాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది నిత్యం జరిగే విషయాలే.  అయితే,  ఓ సంఘటన మాత్రం అందరిని భయపెడుతున్నది.  హాస్పిటల్ కు వెళ్లాలంటే భయపడేలా చేస్తున్నది.  ఆ సంఘటన ఏంటి.. ఎక్కడ జరిగింది.  ఎందుకు జరిగింది తెలుసుకుందాం.  


అది హర్యానా చండీగఢ్ లోని ఓ హాస్పిటల్.  ఆ హాస్పిటల్ నిత్యం రోగులతో రద్దీగా ఉంటుంది.  అక్కడ మార్చురీ కూడా ఉన్నది.  నిత్యం రోగులు, ఆర్తనాదాలతో ఆ హాస్పిటల్ నిండిపోయి ఉంటుంది. ఇక హాస్పిటల్ చుట్టూ సీసీ కెమరాలు కూడా ఉన్నాయి.  ఇదే ఆ హాస్పిటల్ లో జరిగిన ఓ వింత సంఘటనలు బయటకు తీసుకొచ్చింది.  వింత సంఘటన ఏంటి అని షాక్ అవ్వకండి.  


వింత అనడం కంటే భయపెట్టే సంఘటన అని చెప్పడం ఉత్తమం. ఆ హాస్పిటల్ లోనే ఓ మార్చురీ ఉన్నది.  ఆ మార్చురీ గదికి బయట ఓ విశాలమైన ప్రదేశం ఉన్నది.  అక్కడ రెండు కుర్చీలు ఒక వీల్ చైర్ ఉన్నది.  అక్కడ ఓ మూలకు ఉన్న వీల్ చైర్ ఉన్నట్టుండి సడెన్ గా కదిలింది.  ఎవరైనా కదిలించారేమో అనుకున్నారు.  కాదు.. అలా కొద్దిగా ముందుకు కదిలిన ఆ వీల్ చైర్.. ముందుకు కదిలి కాస్త దూరం వెళ్ళింది.  అక్కడి నుంచి దాని దిశను కొద్దిగా మార్చుకొని ముందుకు వెళ్లి గదిదాటి బయటకు వచ్చి కొద్దిరూరం వెళ్లి అక్కడి ఆగింది.  


అక్కడ ఉన్న వ్యక్తులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.  ఏం జరిగిందో తెలియక వాళ్లకు నోటమాట రాలేదు.  ఈ విషయాన్ని సిసి టివిలో రికార్డ్ అయ్యాయి.  ఈ వీడియో బయటకు రావడంతో అక్కడి రోగులే కాదు వైద్యులు కూడా భయపడిపోతున్నారు.  ఆ హాస్పిటల్ లో దెయ్యాలు ఉన్నాయని, గతంలో మరణించిన వ్యక్తులు అలా దెయ్యాలుగా మారి హాస్పిటల్ లో తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి.  వీటిని పుకార్లుగా కొట్టేయ్యలేరు.  


మరింత సమాచారం తెలుసుకోండి: