ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే గుండె సమస్యలు వస్తున్నాయి. శస్త్ర చికిత్సకు లక్షలకు లక్షలు ఖర్చు అవుతూ ఉండటంతో తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు పిల్లల్ని కాపాడుకోవటానికి పడే సమస్యలు అన్నీ ఇన్ని కావు. సకాలంలో వైద్యం అందక పిల్లలు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. గుండె శస్త్రచికిత్స పూర్తి స్థాయిలో చేయించటం భారమైన పేదల పిల్లలకు ఆ ఆస్పత్రి వైద్యులు అండగా నిలుస్తున్నారు. 
 
హైదరాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు గుండెజబ్బులతో బాధపడే పిల్లల కోసం ముందుకు వచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎటువంటి సంబంధం లేకుండా లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్సను అందిస్తున్నారు. చీఫ్ కార్డియాలజిస్ట్ శీధర్ కస్తూరి ఆధ్వర్యంలో నలుగురు చిన్నారులకు ఇప్పటికే గుండె శస్త్ర చికిత్స అందించటం జరిగింది. డివైజ్ క్లోజర్ అనే పద్ధతి ద్వారా శ్రీధర్ కస్తూరి ఈ శస్త్ర చికిత్సను అందించారు. 
 
డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపిన వివరాల ప్రకారం అదిలాబాద్ ప్రాంతానికి చెందిన మూడు సంవత్సరాల సాత్విక్, కామారెడ్డికి 4 సంవత్సరాల రిష్విక, నల్గొండకు చెందిన 10 సంవత్సరాల తేజస్విని, లాలాపేట్ కు చెందిన 6 సంవత్సరాల ఆశ కు డివైజ్ క్లోజర్ పద్ధతి ద్వారా చికిత్స చేశారు. ఈ చికిత్స ద్వారా చిన్నారుల గుండెలోని రంధ్రాలను మూసివేసినట్లు, ప్రస్తుతం చిన్నారులు అందరూ క్షేమంగా ఉన్నట్లు శ్రీధర్ కస్తూరి తెలిపారు. 
 
సన్ షైన్ హాస్పిటల్ వైద్యులు  మారుమూల ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ఈ ఉచిత వైద్య శిబిరాల ద్వారా గుండె జబ్బులున్న పేద పిల్లలను గుర్తించటం జరుగుతుంది. ఆ పిల్లలకు ప్రతి నెల మూడవ బుధవారం రోజు ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తారని సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: