మందుబాబులకు షాకిచ్చే నిర్ణయం ఏపీ సర్కార్ తీసుకుంటోంది.  దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మధ్య షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రభుత్వం ఆధీనంలోనే షాపులు నడుస్తాయి.  సాయంత్రం 9 తరువాత మద్యం అమ్మకాలు ఉండవు.  మద్యం నిషేధం విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.  


ఇందులో భాగంగానే ఒక వ్యక్తి వద్ద కేవలం ముందు లిక్కర్ బాటిళ్లు లేదా.. ఆరు బీరు బాటిళ్లు కంటే ఎక్కువ ఉండేందుకు వీలు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడి అధికారులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు.  ఒక మనిషికి మూడు లిక్కర్ లేదా మూడు బీర్ బాటిల్ కంటే ఎక్కువ అందుబాటులో ఉంచేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. 


వచ్చే ఎన్నికల నాటికి మద్యం దుకాణాలను మూయించేయాలని, కేవలం మద్యాన్ని స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది.  దానికి తగ్గట్టుగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నది. మద్యం పాలసీ విధానాన్ని అతిక్రమిస్తే చర్యలు కూడా కఠినంగా ఉంటాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.  ఈ హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయాలను కఠినం చేసింది ప్రభుత్వం.  


ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీపై అక్కడి మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కసారిగా మద్యం నిషేధిస్తే దానివలన ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు.  అందుకే ఇతర ఆదాయ మార్గాలను పెంచుతూ.. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.  ఇదే విధమైన మద్యం నిషేధాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.  మరి ఈ పాలసీని తెలంగాణలో అమలు చేస్తారా అంటే అది అసాధ్యం అని చెప్పాలి.  ఎందుకంటే తెలంగాణాలో మద్యం అమ్మకాలు ఏపి కంటే ఎక్కువగా ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: