అకాల మృత్యువాతపడి ఎన్ని జీవితాలు చీకట్లో కలసిపోతున్నాయో తెలియదు.ఆ మృత్యువు ఏ రూపకంగా మనిషిని కబళిస్తుందో చెప్పలేం.మరణం వల్ల నిండు నూరెళ్లు బ్రతకవలసిన విద్యార్ధులు కూడా మద్యలోనే జీవితాలు చాలిస్తున్నారు.ఈ కాలంలో ఇంట్లోనుండి బయటకు వెళ్లితే తిరిగి వస్తామనే నమ్మకం చాలమందికి వుండటంలేదు.మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన ఓ విద్యార్ధి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.అతని జీవితాన్ని,జీవితాన్ని పాఠశాల బస్సు చిదిమేసింది. మిత్రుడి తల్లిని పరామర్శించేందుకు వెళుతున్న అతడిని విధి కాటేసింది.ఈ విషాద సంఘటన మార్కాపురం-కంభం రహదారిలో మంగళవారం చోటుచేసుకుంది.



మార్కాపురం గ్రామీణ ఎస్సై జి.వెంకట సైదులు తెలిపిన వివరాల ప్రకారం,కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ద పల్లెకు చెందిన యక్కంటి జయమ్మ ద్వితీయ కుమారుడు వై. చైతన్యకుమార్‌ (19) స్థానిక జార్జి ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లమో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.తనమిత్రుడు టి.కాశిబాబు తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెను పరామర్శించేందుకు మంగళవారం మార్కాపురం నుంచి ఆకవీడుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు.మార్కాపు రం కంభం రహదారిలో వీరి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని జంకె రామిరెడ్డి కాలనీ సమీపంలో వెనుక నుంచి దూసు కొచ్చిన శ్రీ చైతన్య పాఠశాల బస్సు వేగంగా ఢీకొంది.దీంతో వెనుక కూర్చొని ఉన్న చైతన్య కుమార్‌ రోడ్డుపై పడిపోగా,అతనిపై నుంచి బస్సు దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.కాశిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రుడు చైతన్యకుమార్‌ను అక్కడివారు ఆటోలో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా,మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.



ఈసంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని,బంధువులు,విద్యార్థులు.ఆందోళనకు దిగారు.ఇక ఈ సంఘటనతో కళాశాలలో విషాదఛాయలు అలముకున్నాయి.ఇక డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాధిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.బోడపాడు సమీపంలోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఆందోళన చేశారు.సమాచారం తెలుసుకున్న మార్కాపురం గ్రామీణ ఎస్సై జి.వెంకట సైదులు సిబ్బందితో పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: