క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనుమానం వస్తోంది అందరిలోను. టిడిపి సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని ఇప్పటికి పది రోజులైపోతోంది. కోడెల ఆత్మహత్యపై తెలంగాణా ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఆ విచారణలో పురోగతి ఏ మేరకు ఉందో తెలీటం లేదు. కోడెల వాడిన మొబైల్ ఫోన్ కాల్ లిస్ట్ చూస్తే కానీ కీలక సమాచారం తెలీదని పోలీసులే అంటున్నారు.

 

ఇటువంటి నేపధ్యంలోనే కోడెల మొబైల్ ఫోన్ ఆత్మహత్య చేసుకున్న రోజు నుండి మాయమైపోయింది. కోడెల ఆత్మహత్య చేసుకున్న మరుసటి నిముషం నుండే మొబైల్ ఫోన్ కోసం ఎంతమంది వెదికినా కనబడలేదట. కోడెల వాడుతున్న మొబైల్ ఫోన్ కనబడకుండా ఏమవుతుంది ?  ఎక్కడో రోడ్డు ప్రమాదంలో మరణించారంటే ఎక్కడో పడిపోయిందని, ఎవరో ఎత్తుకెళ్ళారని అనుమానించేందుకు అవకాశం ఉంది.

 

కానీ ఆత్మహత్య చేసుకునే అర్ధగంట ముందు కూడా కోడెల తన గదిలో నుండే ఎవరితోనో మాట్లాడినట్లు తేలిపోయింది. ఆత్మహత్య చేసుకున్నాడంటే మొబైల్ కోడెల జేబులోనో, మంచం మీదే లేకపోతే టేబుల్ మీదో ఉండి ఉండాలి. కోడెల ఆత్మహత్యను మొదటి చూసింది కూడా కూతురు విజయలక్ష్మే. తర్వాతే గన్ మెన్, అటెండర్ తలుపులు పగలగొట్టి గదిలోకి ప్రవేశించారు.

 

వాళ్ళతో పాటే కూతురు కూడా గదిలోకి వెళ్ళారు. మొదటి ఇద్దరికీ కోడెల మొబైల్ ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి మొబైల్ తీసుకోవాల్సిన అవసరం, అవకాశం ఎవరికుంది ? ఎందుకంటే కోడెల మొబైల్ ఫోన్లో కాల్ రికార్డింగ్ సదుపాయం ఉందని సమాచారం. కోడెల మొబైల్ ఫోన్ గనుక బయటపడితే రికార్డింగ్ విషయం కూడా బయటకు పొక్కుతుంది. పోలీసులేమో ఎన్నిసార్లు ఇంటిని వెతికినా మొబైల్ కనబడలేదు.  అదే సమయంలో విచారణకు రమ్మంటే కోడెల కూతురు, కొడుకు కూడా సహకరించటం లేదని సమాచారం. మరి ఎందుకు సహకరించటం లేదో వాళ్ళే లేకపోతే చంద్రబాబో చెప్పాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: