హైదరాబాద్‌.. మహా నగరం. ఇక్కడ ఎవరిని నమ్మెకి లేదు. నమ్మరంటే నిలువునా దోచేసుకుంటారు. బంగారం కనిపించిందంటే గొంతు కొసైనా సరే అది తీసేసుకుంటారు. అలాంటి నగరం ఇది. రోజుకో కొత్తరకమైన మోసం తెరపైకి వస్తుంది. అలానే ఈరోజు కూడా ఓ కొత్త రకమైన మోసం తెరపైకి వచ్చింది. ఓ చదువుకున్న ఘరానా లేడి బాగోతం హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.                   


వివరాల్లోకి వెళ్తే .. బిఎస్సి చదివిన ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌ నుండి ఫోటోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతోందని పోలీసులు గుర్తించారు. మంచి పేరున్న స్కూల్స్ ఫేసుబుక్ నుండి అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలు సేకరించి ఆ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి స్కూల్ యజమాన్యులకు పంపేది. డబ్బులు ఇస్తే ఆ ఫోటోలను తొలిగిస్తానని ఆమె చెప్పేది.                               


ఆమె సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చెప్పుకునే ఈ కిలాడీ లేడీ స్కూల్స్‌ కు ఫోటోలను పంపి ఫోన్‌లు చేసి బారీగా నగదు డిమాండ్‌ చేసేది. కాగా నిందితురాలు సెల్‌ఫోన్‌లో దాదాపు 225 కు పైగా స్కూల్స్‌ గ్రూపులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మంచిగా చదువుకున్న ఈజీ మనీ కోసమే ఇలాంటి నేరాలకు పాల్పడిందని సైబర్‌ క్రైమ్ పోలీసులు చెప్పారు.                                                       
                 


మరింత సమాచారం తెలుసుకోండి: