ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చిల్లర వేషాలు వేసిన అభివృద్దే ద్యేయంగా ముందుకు వెళ్తూ అడుగులు వేస్తున్నాడు జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన పాలన ఎంత అద్భుతంగా ఉంటుందో ఆంధ్ర ప్రజలకు రుచి చూపిస్తున్నాడు. ఆంధ్రలో అవినీతి అనేది లేకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. 


ఇంకా జగన్ తీసుకునే సంచలన నిర్ణయాలను చూసి ప్రజలంతా కూడా జగన్ ని సంచలనల ముఖ్యమంత్రి అంటూ పీల్చేస్తున్నారు. అయితే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాలో అవుతున్నడని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇంకా వివరాల్లోకి వెళ్తే .. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎంతోమంది అభిమానులు ఆయన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు. 


అయన రాజకీయ రాకకు సంబంధించి దాదాపు 2 దశబ్దాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు అయన ప్రకటించారు. 'రజనీ మక్కల్ మంద్రమ్' అని పేరుతో 2017 డిసెంబర్ 31న తన పార్టీ పేరుని ప్రకటించిన తలైవా.. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని అయన వెల్లడించారు.


అయితే అప్పుడు ఆలా ప్రకటించిన రజిని ఇంతవరుకు రాజకీయ పార్టీకి సంబంధించి ఒక్క పని కూడా చెయ్యలేదు. సినిమాలలో నటిస్తూ తన పని తాను చేసుకు పోతున్నాడు. కొద్ది రోజులు ఉంటె రజినీకి ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఉందనే విషయాన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు. ఈ నేపథ్యంలో అనుకోని రీతిలో వైఎస్ జగన్ ని ఫాలో అవుతూ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యాడు రజిని కాంత్. 


ఆంధ్రాలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి గల ముఖ్య కారకుల్లో ఒకరిగా నిలిచారు. దీంతో ఇప్పుడు రజిని కూడా అదే బాటలో నడుస్తున్నారు. మరి ప్రశాంత్ కొషోర్ ద్వారా రజిని కాంత్ ముఖ్యమంత్రి అవుతారేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: