హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపుని  అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో... గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి  అన్ని పార్టీలు. అయితే ఈ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్,  కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటీ లో ఉండగా ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ఇంకొన్ని రోజుల్లో ప్రచార రంగంలోకి దిగనున్నారు అన్ని పార్టీల నాయకులు. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ చేయించిన సర్వేలో తెరాస వైపు 55 శాతం కాంగ్రెస్ వైపు 41 శాతం మంది ప్రజలు ఉన్నారని తేలిందని మీడియాతో జరిగిన చిట్ చాట్ లో  కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే తమ సర్వేలో  బిజెపి ఎక్కడో చివర ఉందని తెలిపారు. ప్రజలకు కూడా ఎవరికి ఓటు వేస్తే హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందో తెలుసని ... హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఉత్తంకుమార్ రెడ్డి కి మాత్రమే లాభం చేకూరుతుందని... ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే మొత్తం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

 

 

 అయితే ఈ ఉప ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని బిజెపి కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస హుజూర్నగర్ ఎన్నికల్లో గెలుపొందేదే అని ... కానీ ట్రక్కు గుర్తు వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని  కేటీఆర్ తెలిపారు. మరో నాలుగేళ్లు అధికారంలో ఉండేది  టిఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు క్లారిటీ ఉందని అందుకే తమకు ఓటు వేసి గెలిపిస్తారని  కేటీఆర్  భావిస్తున్నారని చెప్పారు. కాగా పార్టీ నిర్ణయించిన 30 మంది ఇన్చార్జులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని...   స్వయంగా కేసిఆర్ కూడా హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: