హైదరాబాద్ అంటే మన అచ్చ తెలుగులో భాగ్యనగరంగా చెప్పుకుంటాం. హైదరాబాద్ కోటికి చేరిన జనాభాతో ఓ రాష్ట్రంలా  కూడా చెప్పుకునేలా విస్తరించింది. నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ నగరం మెల్లగా అందరినీ తనలో ఇముడ్చుకుంటూ ఇపుడు ఏ స్థాయికి చేరిందంటే ఒక్క మనిషి వచ్చినా కూడా తట్టుకోలేను బాబోయ్ అంటోంది. హైదరాబాద్ కి ప్రక్రుతి అంటే భయమేస్తోంది.


ఎండలు బాగా కాస్తే నీటికి కటకట. వానలు బాగా కురిస్తే కన్నీటి వెతలు. ఇక శీతాకాలం వచ్చిందంటే చాలు మంచు దుప్పటి కప్పేసుకుంటుంది. అందాలకు పెట్టింది పేరుగా, సహజసిధ్ధమైన ప్రక్రుతి ప్రదేశంగా ఉన్న హైదరాబాద్ ఈ తీరునకు రావడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఒక్కటే తడుతుంది. మానవుల స్వార్ధం ఈ నగర జీవన శైలిని చిద్రం చేశాయా అని. అభివ్రుధ్ధి పేరు మీద సాగిన విద్వంసం ప్రక్రుతి ప్రకోపానికి కారణమవుతోందా అన్న డౌట్లు కూడా పుడతాయి.


ఇదిలా ఉండగా హైదరాబాద్ ఎన్నడూ లేని విధంగా ఇపుడు వానలకు వణుకుతోంది. ప్రతీ రోజూ సాయంత్రం అయితే చాలు భారీ ఎత్తున కురుస్తున్న వానలతో నగర జీవనం అతలాకుతలం అయిపోతోంది. ఓ వైపు హుస్సేన్ సాగర్ పరిమితికి మించి నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. అదో ఆందోళన ఉంటే నగరంలో నీళ్ళు నిండి చెరువులను తలపిస్తున్నాయి. పై నుంచి ధారాపాతంగా కురిసే వానలకు హైదరాబాద్  పూర్తిగా  నిండిపోతోంది.


దాంతో వచ్చిన నీరు ఎక్కడికిపోవాలో అర్ధం కాని పరిస్థితి. ఇంతటి చరిత్ర ఉన్న నగరానికి ఈ దుర్గతి ఎందుకు ఇలా అంటే మళ్ళీ చెప్పుకున్నట్లుగా పాలకులు, పాలితులు కలసి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు అని చెప్పుకోవాలి. వాన పడితే ఎక్కడివారు అక్కడే  గప్ చుప్, బయటకు రావద్దు అని పాలకులు పిలుపు ఇస్తున్నారంటే హైదరాబాద్ ఎంతటి డేంజర్లో ఉందో అర్ధమవుతోంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: