ఈ వార్త పసిడి ప్రియులకు ఉరటనిస్తుంది. ఏదైనా ఒక వస్తువు రేటు పెరిగింది అంటే దానికి తగ్గట్టు.. మిడిల్ క్లాస్ వారు కొనెల తగ్గడం కామన్. కానీ ఇక్కడ మాత్రం బంగారం సీన్ రివర్స్. దానికి నచ్చినట్టు అది పెరిగిపోతుంది.. చివరికి వంద, రెండు వందల తగ్గుతూ ... త్వరపడండి.. త్వరపడండి బంగారం ధర భారీగా తగ్గింది అంటూ సీన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. గత నెలలో దాదాపు 6వేలు పెరిగింది.          


ఇప్పుడు 24 రోజుల్లో 2 వేలు తగ్గింది. దీనికి బంగారం భారీగా తగ్గింది అని వార్తలు. ఇంకా విషయానికి వస్తే .. గత నెల భారీగా పెరిగిన బంగారం ధర ఈ నెల అటు ఇటు తగ్గుతూ 2 వేలు తగ్గింది. దీంతో  మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,500 దిగువకు చేరింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కేజి వెండి ధర 47,580 రూపాయిల వద్దకు చేరింది.             


దీంతో పసిడి ప్రేమికులు ఆలోచనలో పడ్డారు. బంగారం కొనాల వద్ద.. అనే ఆలోచనలో పడిపోయారు. మరోవైపు బంగారం తగ్గించినట్టే తగ్గించి ఒకేసారి అమాంతం రేట్లు పెంచేస్తున్నారు. మొన్నటికి మొన్న 15 రోజుల్లో 3 వేలు తగ్గితే కేవలం రెండు రోజుల్లో వెయ్యి రూపాయలు పెంచేశారు. మరి ఇప్పుడైనా బంగారం కొనలనుకునే వారు కొంటె మంచిది. ఎందుకంటె అటో ఇటో కాస్త బంగారం తగ్గింది. మళ్ళీ బంగారం పెరగటం మొదలు పెడితే మధ్య తరగతి ప్రజలు కొనే రీతిలో బంగారం ధర ఉండదు.           


మరింత సమాచారం తెలుసుకోండి: