మూడు ముళ్లు అనే బంధంతో ఏడడుగులు వేసి ఒకటిగా జీవితాన్ని ప్రారంభిస్తారు ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి. కొందరు ఆ బంధాన్ని అనుబంధంగా మార్చుకుంటారు, మరికొందరు సంసార భారాన్ని మోస్తూంటారు, ఇంకొందరు మనస్పర్ధలతో విడిపోతున్నారు. వీటన్నింటికీ వేర్వేరు కారణాలుంటాయనేది నిజం. కానీ మనిషి జీవితం పెళ్లితోనే మలుపులు తిరుగుతుంది. కానీ కొన్ని జంటలు కాళ్ల పారాణి ఆరకముందే మనస్పర్ధలతో విడిపోతుంటే మరికొన్ని జంటలు తనువు చాలిస్తున్నారు. కారణాలేవైనా ఇటివలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి.

 


కర్ణాటకలోని కృష్ణరాజపురంలో పెళ్లైన నాలుగు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం విస్తుగొలుపుతోంది. వివాహిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన బుధవారం సుబ్రహ్మణ్యనగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. జయలక్ష్మి (24) అనే మహిళకు నాలుగు నెలల క్రితం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తితో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి వీరిద్దరూ ఉత్తరహళ్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత జయలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనతో జయలక్ష్మి కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. సుబ్రహ్మణ్యనగర పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

 


అయితే.. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా.. కాపురంలో కలతలు వచ్చాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా పెళ్లైన నాలుగు నెలలకే ఈ విధంగా జరగడం విచారకరం. క్షణికావేశాల్లో ఇటువంటి నిర్ణయాలు మంచివి కావని నిపుణులు చెప్తూంటారు. కానీ వారికి ఆ కారణాలు పెద్దవిగా అనిపించి అర్ధాంతరంగా తనువు చాలిస్తూండటం విచారకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: