ఆ యువకుడు చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోవడంతో ఒంటరిగా మారాడు . ఒంటరి జీవితాన్ని తట్టుకోలేక ఎన్నోసార్లు కుంగిపోయాడు ఆ  యువకుడు. చివరికి అనాధ గా  ఒంటరి జీవితం భారమని భావించి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు . అయితే తాను  చనిపోతే కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ఆ యువకుడికి ఎవరూ లేకపోవడంతో ఓ ప్లాన్ వేసుకున్నాడు. అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి సర్వ్ నీడి  అనే స్వచ్ఛంద సంస్థకు 6వేల రూపాయలు విరాళం  ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ స్వచ్ఛంద సంస్థకు 6వేల రూపాయలు విరాళం  ఇచ్చాడు ఆ యువకుడు. అయితే విరాళం ఇచ్చిన రెండు రోజులకి ఆ యువకుడు చనిపోయినట్టు తెలిసింది. ఆ యువకుడి అతని  అంత్యక్రియలు జరిపించేందుకు సర్వ్ నీడి  అనే స్వచ్ఛంద సంస్థకు 6వేల రూపాయలు ఇచ్చాడు అని అర్థమైంది. అతనిచ్చిన డబ్బులతోనే ఆ యువకుడి అంత్యక్రియలు నిర్వహించారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ఈ విషాద ఘటన నిజామబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

 

 

 నిజామబాద్ జిల్లా గాంధీనగర్ తండాకు చెందిన బొంతు  విజయ్ నగరంలో క్యాబ్  డ్రైవర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. విజయ్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అనాథగా మారాడు. తనకంటూ ఎవరూ లేరని చాలాసార్లు కుంగిపోయేవాడు విజయ్. ఈ నేపథ్యంలోనే తను అనాధనని  తాను చచ్చినా పట్టించుకునే వారు ఎవరూ లేరని చాలాసార్లు బాధపడ్డాడు ఆ యువకుడు. ఈ క్రమంలో విజయ్ జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

 

 

 

 అయితే తన చస్తే కనీసం  అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవ్వరూ లేరు అని భావించి... అనాధ శవాలకు అంత్యక్రియలు చేసే సర్వ్ నీడి  అనే స్వచ్ఛంద సంస్థకు ఆరు వేల విరాళాన్ని అందించాడు . ఆ తర్వాత ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు విజయ్. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విజయ్  రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరకడంతో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి . నా చావుకు ఎవరూ బాధ్యులు కారు నాకు జీవితంపై విరక్తి పుట్టి చనిపోతున్నాను.  నా అంత్యక్రియలను సర్వ్ నీడి  అనే సంస్థతో చేయించండి నా మరణవార్తను పెద్దమ్మ కుమారుడైన సందీప్ కు చెప్పండి అంటూ విజయ్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు సర్వ్ నీడి స్వచ్చంద సంస్థ   విజయ్ అంత్యక్రియలు నిర్వహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: