ప్రపంచంలో ఉగ్రసంస్థల కార్యకలాపాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.  అందులో సందేహం అవసరం లేదు.  ఉగ్రవాదుల కార్యకలాపాలు తీవ్రతరం కావడంతో.. పలు దేశాలు దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి.  ఈ ఇబ్బందుల వలన ఎన్ని చర్యలు తీసుకున్నా కుదరడం లేదు.  అందుకే ఎలాగైనా .. ఉగ్రవాదముల చర్యలను అడ్డుకోవాలని అగ్రదేశాలు చూస్తున్నాయి.  అయితే, పాక్ ప్రధాని ఉగ్రవాద సంస్థల గురించి మొన్నటి రోజున కొన్ని వ్యాఖ్యలు చేశారు.  


ఉగ్రవాద సంస్థల ఫ్రీడమ్ ఫైటర్స్ గా చెప్పుకుంటూ.. ఆఫ్ఘన్ దేశంలో ఉండేవని, అప్పట్లో వాటిపై పోరాటం చేసేందుకు అమెరికన్ సైన్యం వారిపై పోరాటం చేసింది. ఆ సమయంలో పాక్ తో చేతులు కలిపిందని, అమెరికన్ సైన్యం పాక్ నుంచి వెళ్లిపోయిన తరువాత.. పాక్ లోకి ఆ సంస్థలు వచ్చాయని.. వాటి కారణంగా తమ దేశంలోని ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని అన్నారు.  అయితే, ఇస్లామిక్ తీవ్రవాదం పేరుతో అందరిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.  


కేవలం 500 మంది ఉగ్రవాదులను అడ్డుకోవడానికి 90వేలమంది సైన్యాన్ని కాశ్మీర్ లో ఉంచడం విషాదం అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.  ఇదిలా ఉంటె, పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు తమ లక్ష్యం మోడీ, అమిత్ షాలే అని చెప్పడంతో.. వారిద్దరికీ భద్రతను పెంచారు.  భారత్ లోని 30 నగరాల్లో దాడులు చేస్తామని, ప్రముఖ రైల్వేస్టేషన్, ఆలయాలను పేల్చివేస్తామని అంటున్నారు.  అది వారికి సాధ్యమయ్యే విషయమేనా అన్నది ఆలోచించాలి.  


తీవ్రవాదులు ఈసారి ఇండియాలో ఎలాంటి దాడులకు పాల్పడ్డా దానివలన పాక్ ఎంతగా ఇబ్బంది పడుతుందో ఇప్పటికే ఇండియా స్పష్టం చేసింది.  పాక్ సైన్యం ప్రోద్బలంతోనే ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.  ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ అన్ని చోట్ల అలర్ట్ చేసింది.  ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింతగా పెంచింది.  ఉగ్రవాదుల నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది ఇండియా.  


మరింత సమాచారం తెలుసుకోండి: