నగరంలో వర్షాలు ఆగేలా లేవు.  ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి.  ఈ వర్షాల ధాటికి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి.  ముఖ్యంగా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.  రోడ్లు చెరువులు ఏకం అవుతున్నాయి.  అటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  కర్నూలు, అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటం విశేషం.  


గత పదేళ్లలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు.  ఇక రాష్ట్రంలోని జలాశయాలన్ని నిండుకుండలా కానిస్తున్నాయి.  చెరువులు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు వరదల కారణంగా మునిగిపోయాయి.  గోదావరికి మరలా వరద పోటెత్తేలా కనిపిస్తోంది.  ఇటీవలే గోదావరిలో బోటు మునిగి 40 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే.  ఇంకా బోటు గోదావరి నీటి అడుగుభాగంలోనే ఉన్నది.  


హైదరాబాద్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారిపోయింది.  ఎండాకాలంలో మాత్రమే ఉండేలా రోడ్లు వేసినట్టు కనిపిస్తోంది.  ఒక్క అరగంట వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ దారుణంగా మారిపోతున్నాయి.  ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కుదరడం లేదు.  ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తే.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతున్నాయి.  


అరగంట ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతున్నది.  ట్రాఫిక్ ను తగ్గించేందుకు ప్రజా రవాణా సౌకర్యాలు పెంచుతున్నా.. చాలామంది సొంత వాహనాల్లోనే ఆఫీస్ లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.  వీటి నుంచి బయటపడాలి అంటే తప్పకుండా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి.  మరో రెండు రోజులు నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నది.  ఇదే ఇలా మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే.. ఇక నగరంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: