గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు.  భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. నగరం చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు బయటకు వచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.  వర్షాల కారణంగా అపార్ట్మెంట్ సెల్లార్స్ లోకి నీళ్లు ప్రవేశించడంతో అవస్ధలు పడుతున్నారు. నీటి సంపుల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.  ఇక సెలర్లలో ఎక్కవ రోజులు నీళ్లు ఉండిపోతే..వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్నికాదు.  


అసలే మన అపార్ట్మెంట్లు ఎంత బలంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఎప్పుడు కూలిపోతాయే తెలియకుండా ఉంటాయి. దానికి తోడు ఇలా నీరు చేరిపోతే ఇక చెప్పేదేముంది.  భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  ఇదిలా ఉంటె, గతంలో 2009-10 వ సంవత్సరంలో ఇలానే భారీగా వర్షాలు కురిశాయి.  ఆ వర్షాల ధాటికి నగరాల్లోని నీరంతా హుస్సేన్ సాగర్లోకి చేరింది.  అలా హుస్సేన్ సాగర్ లోకి నీరు చేరడంతో.. పూర్తిగా నిండిపోయింది.  అసలే హుస్సేన్ సాగర్ నుంచి విపరీతమైన వాసనా వస్తుంటుంది.  పైగా వినాయక చవితి సమయంలో రకరకాల రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమర్జనం చేయడం కారణంగా వానస మరింత పెరిగిపోతుంది.  


ఈ సమయంలో ట్యాంక్ బండ్ దగ్గరనున్న హుస్సేన్ సాగర్ పొంగి ప్రవహిస్తే పరిస్థితి ఏంటి.. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. ఒకసారి ఆలోచించండి.  హుస్సేన్ సాగర్ పొంగి ప్రవహిస్తే.. దాని వలన వచ్చే వాసనకు లోయర్ ట్యాంక్ బండ్ మొత్తం ఇబ్బందులు పడుతుంది.  ఇరవై ఏళ్ళ క్రితం అలానే జరగడంతో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న దోమల్ గూడ తదితర ప్రాంతాల ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేసి ప్రాణాలకు అరచేతిలో పెట్టుకొని పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.  ఈసారి మరలా అలానే జరిగేలా కనిపిస్తోంది.  కాబట్టి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే ప్రజలు ప్రాణాలు దక్కించుకున్న వాళ్లౌతారు.  మరి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: