నారావారి పుత్రరత్నం లోకేష్ విచిత్రమైన ట్వీట్ చేశారు. తన తండ్రి హామీ ఇచ్చి అమలు చేయటంలో ఫెయిలైన రైతు రుణమాఫీని అమలు చేసేంత వరకూ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని బెదిరిస్తున్నారు. బుర్రలోకి ఏది తోస్తే అంతా ట్వీట్లు పెట్టేసే లోకేష్ ఇప్పటికే అబాసుపాలయ్యారు. లోకేష్ ఏ ట్వీట్ పెట్టినా వెంటనే నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు.

 

అయినా లోకేష్ కు జ్ఞానోదయం అవుతున్నట్లు లేదు. తన తండ్రి, మాజీ సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని జగన్ ను బెదిరించటంలోనే లోకేష్ పరిజ్ఞానం ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.  రైతు రుణమాఫీ అన్నది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ అన్న విషయం అందరికీ తెలిసిందే. రైతుల ఓట్లను కొల్లగొట్టటానికి చంద్రబాబు చేసిన తప్పుడు హామీ అన్న విషయం అప్పట్లోనే అందరికీ తెలుసు.

 

అయితే రైతులు మాత్రం అమాయకంగా చంద్రబాబును నమ్మి ఓట్లేశారు. అధికారంలోకి రాగానే తన అసలు స్వరూపమేంటో రైతులకు మళ్ళీ చూపించారు. ఎన్నికలకు ముందు రూ. 90 వేల కోట్ల రుణాలను అధికారంలోకి రాగానే రూ. 27 వేల కోట్లకు కుదించటంతోనే చంద్రబాబు రైతుల నడ్డి విరిచారు. సరే తర్వాత చాలా విన్యాసాలే చేశారు చంద్రబాబు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబును నమ్మకుండా రైతులు గట్టి బుద్ధి చెప్పారు.

 

దాంతో చంద్రబాబు చేతకాని తనమేంటో ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏరోజు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పలేదు. రైతు భరోస అనే పథకాన్ని తీసుకొస్తానని చెప్పారు. దానికి తగ్గట్ల చర్యలు తీసుకుంటున్నారు. దాంతో జగన్ పాలపై బురదచల్లే ప్రయత్నంలో  రైతు రుణమాఫీ చేసేంతవరకూ ను వదిలిపెట్టేది లేదంటూ ట్విట్టర్లో జగన్ ను బెదిరించటమే విచిత్రంగా ఉంది. తన తండ్రి ఇచ్చిన తప్పుడు హామీని జగన్ అమలు చేయాలని లోకేష్  కోరుకోవటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: