ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే సంచలనల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర ప్రజల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కంటి వెలుగుతో ఆంధ్ర ప్రజల కళ్ళకు వెలుగుని ఇవ్వనున్నాడు జగన్.        


వివరాల్లోకి వెళ్తే .. ఇప్పటికే తెలంగాణాలో కంటి వెలుగు పథకం ప్రారంభించి .. వైద్య పరీక్షల చేసిన సంగతి తెలిసిందే. కొందరికి కళ్ళ అద్దాలు ఇవ్వగా మరికొందరి కళ్ళకు ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రలో కూడా కంటి వెలుగు పథకం అమలు కానుంది. వచ్చేనెల 10 నుంచి లాంఛనంగా ఈ పథకం ప్రారంభం కానుందని అధికారులు పేర్కొన్నారు.         


వచ్చేనెల 10 నుంచి కంటి వెలుగు ప్రారంభం అవ్వగా ప్రజలందరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి అద్దాలు అవసరం ఉన్న వారికీ అద్దాలు పంపిణి చెయ్యనున్నారు. అవసరమైన వారికీ ఆపరేషన్ కూడా నిర్వహించనున్నారు. కాగా ఈ కంటి వెలుగు పథకాన్ని ఐదు దశల్లో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.          


తొలి రెండు దశల్లో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆతర్వాత మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటి బేస్ ఆధారంగా కంటి పరీక్షలు చెయ్యనున్నారు. కలెక్టరర్ల ఆధ్వర్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీలు కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా రాష్ట్రంలోని పేదలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అవసరమైన వారికి ఆపరేషన్ కూడా చేస్తామని తేల్చిచెప్పారు.           


మరింత సమాచారం తెలుసుకోండి: