తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు వస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  ప్రస్తుతం ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ వారు.  తాజాగా ఈదురు గాలులకు ఎన్డీఆర్ఎఫ్ బోటు బోల్తా పడింది.  ప్రమాదం పొంచి ఉందని ముందే ఊహించిన సిబ్బంది బోటు తో సహా ఒడ్డుకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

ఈ ఘటన దేవిపట్నం(మం) మంటూరులో దగ్గర గోదావరిలో జరిగింది.  ఇటీవల కచ్చులూరు లాంచి ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారే ఈదురుగాలులు రావడంతో బోటు అదుపు తప్పింది..ఒక్కసారే బోల్తా పడింది. అయితే లైఫ్ జాకెట్ ఉండటంతో బోటుతో సహ ఇద్దరు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయట పడగలిగారు.

కాగా, కచ్చులూరు లాంచి మునిగి పదిరోజులు కావొస్తున్నా ఆ లాంచ్ ని ఇంకా బయటకు తీయలేదు..మరికొంత మంది జాడ ఇంకా లభించలేదు. ఈ విషయంపై బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: