అంగారక గ్రహం చూశారా ఎలా ఉంటుంది.. అంటే చూడకపోయినా.. అక్కడి పరిస్థితులను బట్టి.. అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఆ గ్రహం ఎర్రగా ఉంటుంది.. వాతావరణం పొడిగా ఉంటుంది.  గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది.  ప్రాణవాయువు ఉండదు కాబట్టి.. మనిషి జీవనం కష్టం...ఇలా వరసగా చెప్పుకుంటూ పోతారు.  


అయితే, అంగరకగ్రహం మీద ఉన్న వాతావరణం భూమిపై ఉంటె.. నమ్మశక్యంగా లేదు కదా.. నమ్మక తప్పదు.  ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో ఇలాంటి అనుభవం కలిగింది. మాములుగా ఆ ప్రాంతంలో సూర్యాస్తమయం సమయంలో ఆకాశం ఎర్రగా మారుతుంది.  ఆకాశాన్ని చూస్తే ఎవరికైనా సరే ఓ విషయం గుర్తుకు వస్తుంది.  సెక్రెటరీ సినిమాలో రావుగోపాలరావు ఓ డైలాగ్ చెప్పారు..ఆకాశం చూశావా.. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదు.. అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది.  


అవును ఆ డైలాగ్ లో ఉన్నట్టుగానే ఆకాశం ఉన్నది.  సూర్యస్తమయం సమయంలో కనిపించే ఆకాశం రంగు పట్టపగలే మారిపోయింది. ఆకాశం మాత్రమే రంగు మారలేదు.  ఆ రంగు కారణంగా.. చుట్టుప్రక్కల భూమిపై ఉన్న ప్రాంతాలన్ని కూడా ఎర్రగా మారిపోయి.  అక్కడి ప్రజలు ఏదో జరిగిపోతుందని భయపడ్డారు.  కాసేపు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  


ఇలా అంగారక గ్రహంలా ఎర్రగా మారడానికి అక్కడి అడవులు దహనమే కారణం అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.  అడవులను దహనం చేయడం వలన అలా మారిపోయింది.  దట్టమైన పొగలు అలుముకోవడం వలన వాతావరణం ఎర్రగా మారిందని, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోకపోతే ఇదే విధమైన వాతావరణం భవిష్యత్తులో కూడా కనిపిస్తుందని ఫలితంగా భూమిపై మనుగడ ప్రశ్నర్ధకం అవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: