ఈ ఎస్ ఐ మందుల కొనుగోలు స్కామ్ లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అధిక ధరలకు మందులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ స్కామ్ పై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు అవసరం లేకపోయినా 300 కోట్ల రూపాయల మందులు కొనుగోలు చేసినట్లు, 10,000 రూపాయల మందులకు లక్ష రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. 
 
బినామీల పేర్లతో మందులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 23 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. ఈ ఎస్ ఐ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచటంతో నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. 12 మంది అధికారులు, 13 మంది అనధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 
 
మొదట దేవికారాణి మీద అక్రమాలు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ అక్రమాలపై కేసులు నమోదు కావటంతో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు అన్నీ పూర్తయిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. మందుల కొనుగోలులో అక్రమాలు చేసి అవినీతి సొమ్ము సంపాదించటంతో నిజానిజాల విచారణ కొరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ప్రాథమికంగా 10 కోట్ల రూపాయల వరకు అవకతవకలు గుర్తించామని సోదాలు పూర్తయ్యాక మిగతా విషయాల గురించి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ అవినీతిలో భాగం అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక టీవీ ఛానల్ అధికారి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహించారని తెలుస్తుంది. ఈ ఎస్ ఐ మందుల కొనుగోలులో ఇంత భారీ స్కామ్ జరగటం సంచనాలకు వేదిక అవుతుంది. ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు వస్తే ఈ కేసులో భాగం అయిన మరికొందరి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: