అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మెగా అభిమానులే కాదు... తెలుగు ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే టీజర్ రెండు  ట్రైలర్ లతో ఈ సినిమాపై  అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమాని తెలుగులో కాకుండా ఇంకా అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో  మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్  నిర్మించాడు. కాగా  ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ కూడా విడుదల చేసింది. సైరా సినిమా కి యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్. 

 

 

 

 కాగా సైరా సినిమా రెండు గంటల యాభై నిమిషాల నిడివితో విడుదల కాబోతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో... చిరంజీవితో పాటు భారీ తారాగణం కూడా నటించారు. కాగా  ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహారెడ్డి సినిమా ని అన్ని కోణాల్లో  అద్భుతంగా చిత్రీకరించారని సెన్సార్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా చరిత్రను తిరగ రాయడం ఖాయమని... మెగాస్టార్ ఈ  చిత్రం తో సంచలనం సృష్టిస్తారని  సెన్సార్ సభ్యులు తెలిపారు. 

 

 

 

నూట ఎనభై ఏళ్ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా అద్భుతంగా చూపించారని  ... చిత్రనిర్మాణం నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారని అన్నారు.   అయితే ఈ సినిమాకి క్లైమాక్స్ చిత్రానికి  ప్రాణంగా నిలబడతాయని మొత్తంగా సైరా సినిమా అద్భుతంగా ఉందని సెన్సార్ సభ్యులు తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు పాసిటివ్ రివ్యూ ఇచ్చినప్పటికీ... ప్రేక్షకులు సినిమాను ఏ విధంగా ఆదరిస్తారో  చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: