హైద‌రాబాద్‌లో వ‌ర్ష బీభ‌త్సం న‌ర‌కం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌ను రెండ్రోజులు వర్షం ముంచెత్తింది. సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో అత్యధిక వర్షాలు కురిశాయి. 2017 సెస్టెంబర్ 14న హైదరాబాద్‌లోని మల్కాజిగిరి వంటి కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుత సెప్టెంబర్‌లో హైదరాబాద్ అంతటా కేవలం 24 గంటల్లోనే 9 నుంచి 12 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం రికార్డని చెప్పారు. హైదరాబాద్‌లో 24 ఆగస్టు 2000 సంవత్సరంలో 24.1 సెం.మీ. అతి భారీ వర్షం కురవగా, శతాబ్దకాలంగా హైదరాబాద్‌లో అదే రికార్డు.


దేశంలో హైదరాబాద్​కి ప్రత్యేక స్థానం ఉంది. వివిధ దేశాల ప్రజలకు జియోగ్రాఫికల్​గా, క్లైమేట్​పరంగా ఈ భాగ్యనగరంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే పేరొచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రాజధానిని దేశానికి రెండో రాజధానిగా చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి ప్రమాదాలు జరగని ఎత్తైన ప్రాంతంలో హైదరాబాద్‌ ఉంది. ఇలాంటి సేఫ్​ సిటీలో విపత్తులను  మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి ఈ విశ్వ నగరంలో మురుగు నీరు, వర్షపు నీరు విడివిడిగా ప్రవహించేలా ఏర్పాట్లు ఉండాలి. పెరిగే పాపులేషన్​కి అనుగుణంగా డ్రైనేజీ సిస్టమ్​ని పటిష్టంగా నిర్మించాలి. కానీ.. ఇవన్నీ లేకుండా ఎవరి అవసరాలకు తగ్గట్గు వాళ్లు ఇళ్లు కట్టుకోవడంతో నగరం నరకంలా మారింది. డ్రైనేజీలు, చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా స్వాహా చేశారు. చిన్నపాటి వానకే విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. నీళ్లు రోడ్లపై నిలవటంతో గుంతలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా నగరం నిలువునా జలమయమవుతోంది.


దీనికి, గ్రౌండ్​ వాటర్​ లేకపోవడంతో హైదరాబాద్​లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. 2007లో అప్పటి ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది. ఇంకుడు గుంతలు లేని ఇంటికి నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. కానీ.. పొలిటికల్​ లీడర్లు స్వార్థంతో ఇంకుడు గుంతలు లేకున్నా కన్​స్ట్రక్షన్​కి పర్మిషన్​ ఇచ్చేందుకు లోపాయికారిగా సహకరించారు. దీంతో ఇంకుడు గుంతల నిర్మాణ లక్ష్యం ఫెయిలయ్యే పరిస్థితి వచ్చింది. అయిపోయిందేదో అయిపోయింది. ఇకనుంచైనా ఇంకుడు గుంతల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నగరంలో ఎక్కడి వర్షపు నీళ్లు అక్కడే ఇంకిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి చర్యలతోనే నగరాన్ని రక్షించుకోవచ్చు. వాన నీటి ఇబ్బందులను తొలగించుకోవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: