అరవింద్ కేజ్రీవాల్.....ఢిల్లీ ముఖ్యమంత్రి. ముక్కుసూటిగా పాలన కొనసాగిస్తూ....అనుకున్నది సాధించే మనిషి. తాను తీసుకున్న నిర్ణయంపై ఎన్ని విమర్శలు వచ్చినా..దాన్ని అమలు చేయడంలో వెనక్కి తగ్గరు. ప్రజల మేలు కొరకు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే నేత. అయితే కొంచెం అటు ఇటుగా...ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదే తీరుతో ముందుకెళుతున్నారు. ఏదైనా మాటకు కట్టుబడి ఉంటే దాన్ని నిలబెట్టుకునే వరకు నిద్రపోరు. అలాగే ఒక విషయంలో మంచి జరుగుతుంది అనుకుంటే...దాని కోసం ఎంతైనా కష్టపడతారు.


ఉదాహరణకు పోలవరం రివర్స్ టెండరింగ్ లో అనేక విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు. వందల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారు. ఇవే విషయాలు జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కార్యకర్తలకు ఆయన ఆంధ్రా కేజ్రీవాల్ లాగా కనిపించేలా చేస్తున్నాయి. జగన్ సీఎం అయితే తండ్రి వైఎస్సార్ పాలనని మరిపిస్తాడని అనుకుంటే....ఆయన కేజ్రీవాల్ ని తలపిస్తున్నారని పులివెందుల కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దగ్గర చెప్పుకున్నారు.


ఈ విషయాన్ని ఆమంచి మీడియా ముందు చెప్పారు. పదిరోజుల క్రితం అమరావతిలో తనని కొందరు పులివెందుల కార్యకర్తలు కలిశారని, జగన్.. తన తండ్రి వైఎస్‌ను గుర్తు చేస్తాడనుకుంటే.. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గుర్తు చేస్తున్నారని చెప్పారని ఆమంచి తెలిపారు. ముక్కుసూటిగా పాలన కొనసాగించడం వలనే జగన్ ని అరవింద్ కేజ్రీవాల్ తో పోల్చినట్లు తెలుస్తోంది.


అయితే వైఎస్సార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే...దాని మీద ఏమైనా విమర్శలు వస్తే, కొంచెం ముందు వెనుక ఆలోచిస్తారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద ఎన్ని విమర్శలు వచ్చిన ముందుకెళ్ళతారు. ఇదే విషయం ఇప్పుడు పులివెందుల కార్యకర్తల దృష్టిలో జగన్...మరో ఆంధ్రా అరవింద్ కేజ్రీవాల్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: