ప్ర‌భుత్వంలో అధికారుల బ‌దిలీలు కామ‌న్‌గా జ‌రిగేవే. ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు అనుగుణంగా అధికారుల ప‌ద వుల్లో మార్పులు చేర్పులు జ‌రుగుతుంటాయి. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఇలాంటి మార్పులు చేర్పులు అనివార్యంగానే సాగాయి. అయితే, ప్ర‌స్తుత జ‌గ‌న్ పాల‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఆయ‌న ఎవ‌రిని బ‌దిలీ చేసినా.. రాజ‌కీయ కోణంలో చూడ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు, ప్ర‌తిప‌క్షాల‌ను స‌మ‌ర్ధించే ఓ వ‌ర్గం మీడి యాకు సాధార‌ణంగా మారిపోయింది. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీటీఎస్‌ ఎండీగా ఉన్న అనూప్‌సింగ్‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేస్తూ.. ఉత్త ర్వులు ఇచ్చింది.


అదేస‌మ‌యంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్ర‌బాబును కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. అయితే ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అవినీతిని పెంచి పోషించేందుకే బ‌దిలీ చేసింద‌నే అర్ధం వ‌చ్చేలా క‌థ‌నాలు వండి వార్చింది .. టీడీపీ వారి అభిమాన ప‌త్రిక‌. రాష్ట్రంలో భూధార్‌ ప్రాజెక్టు అమలు కోసం కార్స్‌ నెట్‌వర్క్‌ (కంటిన్యూయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌-కార్స్‌) ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే భావించారు. ఇందుకోసం జగ్గయ్యపేట మండలంలో పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టాలనుకున్నారు.


అయితే, దీనికి సంబంధించిన టెండ‌ర్ల‌ను సొంతం చేసుకునే సంస్థ‌లు పైల‌ట్ ప్రాజెక్టుగా కొంత‌మొత్తానికి చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో కొంత ఎక్కువ‌కే ప‌నులు అప్ప‌గిస్తారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన ప‌నుల విష‌యంలో త‌గ్గిస్తారు. అయితే, ఇక్క‌డ అనూప్ సింగ్ అనే వ్య‌క్తి ప్ర‌భుత్వ సొమ్మును కాపాడుతుంటే.. ఆయ‌ననుస‌ర్కారే బ‌దిలీ చేసింద‌ని స‌ద‌రు ప‌త్రిక క‌థ‌నాన్ని రాసుకొచ్చింది. ఇక‌, ఎల‌క్ట్రి క్ బ‌సుల విష‌యంలో వేలు పెట్టినందుకే ఆర్టీసీ ఎండీ సురేంద్ర‌బాబును త‌ప్పించి.. క‌నీసం పోస్టింగ్ కూడా ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ మ‌రో క‌థ‌నం వ‌రుస‌నే రాసుకొచ్చింది.


అయితే, వాస్త‌వానికి ఇవ‌న్నీ కాద‌ని, ప్ర‌భుత్వ వ్యూహం ప్ర‌కార‌మే అధికారులు న‌డుచుకుంటార‌ని, బ‌దిలీలు ఉద్యోగ జీవితంలో ఓ భాగ‌మ‌ని అంటున్నారు ఐఏఎస్, ఐపీఎస్ సంఘం అధికారులు. ఏదేమైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉద్యోగులే కేంద్రంగా సృష్టిస్తున్న వివాదాల్లో ఇది తొలి అడుగ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: