మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు ప్రసంగాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు ప్రధాని మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఎన్నో మాటలు అన్నారు. చివరకు ఆయన భార్యను వదిలేసిన వ్యక్తిగా కూడా చిత్రీకరించారు. ఎన్నికలు అయిపోయాయి. మళ్లీ దేశమంతా మోడీ హవాయే కనిపించింది.


మోడీ తాజా అమెరికా పర్యటన ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచేసింది.. ఓ సామాన్య చాయ్‌వాలా ప్రపంచాన్ని శ్వాసించి, శాసించే శ్వేత సౌధాథిపతి భుజంపై చేయి వేసి మాట్లాడటం ఏమిటి? భారత ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ కంటిని అమెరికా వేలితో పొడిపించడం ఏమిటి? అమెరికాలో నివసిస్తూ ఆ దేశానికి కీలక రంగాల్లో మూల స్తంభంగా ఉన్న మా భారతీయుల శక్తి తక్కువగా అంచనా వేయవద్దని ఆ దేశ అధ్యక్షుడి కి చెప్పకనే చెప్పడమేమిటి? అంతముందు తానే పంచాయితీ చేస్తానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు, కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునే దమ్ము భారత్‌కు, అదీ ఆ చాయ్‌వాలాకు ఉందని అదే అధ్యక్షుడు మాట మార్చడమేమిటి?


ఇది అక్షరాలా నరేంద్ర భాయ్ మోదీ శ్వేతదేశం గడ్డపై చేసిన మ్యాజిక్కే. మొత్తంగా మోదీ అమెరికా పర్యటన ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను మరింత పెంచినట్టయింది. ఇప్పటివరకూ మోదీని వామపక్ష ప్రభావంతో విమర్శించే మేధావులు, తటస్థులు సైతం ఆయన తాజా పర్యటన, ప్రసంగానికి ముగ్ధులయిపోయారు. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాలు, యువత పూర్తిగా మోదీ మ్యాజిక్‌కు అనుకూలంగా మారిపోయారు.


అందుకే ఇప్పుడు చంద్రబాబు రూటు మార్చేశారు.. మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం మధ్యవర్తులతో మాటలు మొదలుపెట్టారు. ముందుగా తన పార్టీలోని వ్యక్తులను అటు పంపారు.. మొత్తానికి మోడీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి మోడీ ఎంత వరకూ చంద్రబాబును కరుణిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: