భారతదేశంలో ప్రతిరోజూ సుమారు 26,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని  కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి  డి.వి. సదానంద గౌడ తెలియజేశారు. ప్లాస్టిక్‌లను రీసైక్లింగ్ చేయడానికి నూతన మరియు సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సిపెట్‌కు ఆయన సూచించారు. గురువారం చర్లపల్లి వద్ద సిపెట్ నూతనంగా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని కేంద్ర మంత్రి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వసతిగృహంలో 145 గదులు ఉన్నాయని, 450 మంది విద్యార్థులు ఉండే సామర్థ్యం కలిగివుందని అన్నారు.  దీని వల్ల  పాలిమర్ టెక్నాలజీలో విద్యను అభ్యసించే విద్యార్థులను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. మెదక్ లో సిపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) నూతన కేంద్రం రానున్నట్లు కేంద్ర మంత్రి  సదానంద గౌడ ప్రకటించారు.


రూ. 58.32 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ సంస్థ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తితో  భరిస్తాయి. ఈ సంస్థ ఏర్పాటుకు భూ సేకరణ జరిగినట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రం అండర్ గ్రాడ్యుయేట్,  గ్రాడ్యూయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్ డి కోర్సులను అందిస్తుందని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు శ్రీ సదానంద గౌడ తెలిపారు. అక్టోబర్ 2 లోగా ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని మంత్రి చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ, అటువంటి ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని , ఎందుకంటే అవి ప్రతిచోటా చెత్తకుప్పలుగా ఉండి సరిగా రీసైకిల్ చేయబడవు అని మంత్రి అన్నారు.




ప్లాస్టిక్‌ను మానవ జీవితంలోని ప్రతి రంగాలలోనూ, ప్యాకేజింగ్, ఆటోమొబైల్స్, వ్యవసాయం, మెడిసిన్ వంటి అనేక ఆర్థిక రంగాలలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ పరిశ్రమలో 4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని ఆయన అన్నారు. రసాయనాలు మరియు ఎరువుల శాఖ, సిపెట్ ద్వారా 80 ప్రదేశాలలో సామూహిక శుభ్రత డ్రైవ్, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, పిల్లల కోసం పోటీలు నిర్వహించడం, ఎగ్జిబిషన్లు నిర్వహించడం, రీసైక్లింగ్ , చెత్త పారవేయడంపై వీడియోలను ప్రదర్శించడం, పిల్లలతో ర్యాలీలు, మరియు శ్రమ్‌దాన్ వంటివి నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న రోడ్లపై ప్లాస్టిక్ పదార్థాలను చెత్త బుట్టలో వేయాలని ఆయన ప్రజలను కోరారు.



సిఎస్‌టిఎస్ హైదరాబాద్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా, పిజి డిప్లొమా కోర్సులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఇతర రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. డిజైన్, టూలింగ్ మరియు అచ్చు తయారీ, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్, ఐటి, ప్యాకేజింగ్ మరియు టెలిట్రోనిక్స్ వంటి ముఖ్య రంగాలకు ప్లాస్టిక్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో సాంకేతిక సేవలను సిపెట్ అందిస్తుంది. కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఎ రేవంత్ రెడ్డి, హైదరాబాద్  మేయర్  బొంతు రామమోహన్, శాసన సభ్యులు బి. సుభాష్ రెడ్డి, ఉప్పల్  మాజీ శాసన సభ్యులు ప్రభాకర్, భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ కాశీనాథ్ ఝా తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: