ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన విజయవంతమైంది. అనుకున్న దాని కంటే సూపర్ హిట్ గా సాగుతోంది. ప్రధానంగా మోడీ కాశ్మీర్ ఇష్యూను అమెరికాలో ఎదుర్కొన్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మధ్యవర్తిత్వం వహించేందుకు ఉత్సాహపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కే జలక్ ఇచ్చేలా మోడీ చేసిన ప్రసంగం భారతీయుల మన్ననలు అందుకుంటోంది.


ట్రంప్ భుజంపై పాకిస్తాన్‌ను తుపాకీతో పేల్చిన మోదీ వ్యూహం, అందుకు ఆయన ఎంచుకున్న వేదికను చూసి సగటు భారతీయుడు ఫిదా అయపోయాడు. సరిగ్గా మోదీ ఇక్కడే దౌత్యనీతి, లౌక్యం ప్రదర్శించినట్లు ఆయన ఎంపిక చేసుకున్న వేదిక ప్రాంతం స్పష్టం చేసింది. మన కంట్లో పాక్ వల్ల నలుసులా కశ్మీర్ ఉన్నట్లే, అమెరికాకు కాలులో ముల్లులా ఉన్నదే టెక్సాస్. అది కూడా మన కశ్మీర్ లాంటిదే మరి. టెక్సాస్ గతంలో మెక్సికోలో భాగమే. తర్వాత స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని, ఆ తర్వాత అమెరికాలో కలవడానికి ఒప్పందం కుదుర్చుకుంది.


అప్పటినుంచీ అమెరికా-మెక్సికో మధ్య సరిహద్దు సమరమే జరుగుతోంది. అంటే అమెరికా కూడా.. మనం ఎలా పాక్ వల్ల కశ్మీర్‌లో ఇబ్బంది పడుతున్నామో, అమెరికా కూడా మెక్సికోలో ఇబ్బంది పడుతోందన్న మాట. అందుకే.. మనం మనం కశ్మీర్ కోసం ఎంత కష్టపడుతున్నామో, పాక్ వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో అమెరికాకు స్వయంగా చెప్పేందుకే మోదీ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న వైనాన్ని.. అంతా మెచ్చుకుంటున్నారు.


అదే వేదికపై తాను ధైర్యంతో చేసిన ఆర్టికల్ 370 రద్దును మోడీ స్పృశించారు. వేర్పాటువాదాన్ని అంతమొందించాలని పరోక్షంగా పాక్‌నుద్దేశించి హెచ్చరించారు. మళ్లీ మరోసారి ట్రంప్ గెలుస్తారన్న రాజకీయ వ్యాఖ్య మోదీలోని రాజకీయ మేధావిని ఆవిష్కరించింది. మొత్తానికి ప్రధాని మోడీ సాధించిన దౌత్య విజయాలు పాక్ కు చెంపదెబ్బగా మారాయి. కాశ్మీర్ పై యాగీ చేయాలనుకున్న పొరుగుదేశం కుట్రలు ఫలించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: