రోజు రోజుకు బంగారం ధర పడిపోతూనే వస్తుంది.ఒక్కసారిగా బంగారం ప్రియులను భయపెట్టిన పసిడి ఇలా పతనవ్వడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇక బంగారంధరలు సడెన్ గా తగ్గుముఖం పట్టడంతో పసిడిప్రియులు ఊపిరి పీల్చుకుంటు న్నారు.వరుసగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది.



ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం ఇందుకు కారణం.ఇకపోతే దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత నెల గరిష్ట స్థాయి (రూ.39,885) నుంచి చూస్తే 10 గ్రాములకు ఏకంగా దాదాపు రూ.2,300 దిగొచ్చింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది.ఇటీవల గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా రూ.4,700 పతనమైంది.ఇకపోతే ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.497 పతనమైంది. రూ.38,685కు దిగొచ్చింది.10 గ్రాములకు ఇది వర్తిస్తుంది.



వెండి ధర కూడా ఏకంగా రుూ.1,580 తగ్గుదలతో రూ.47,235కు తగ్గింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారంధర ఔన్స్‌ కు 0.4 శాతం పెరుగుదలతో 1,509 డాలర్ల వద్ద కదలాడుతోంది.బుధవారం పసిడి ధర దాదాపు 2 శాతం పడిపోయంది.ఇక పోతే వెండి ధర 0.4 శాతం తగ్గుదలతో ఔన్స్‌కు 18.51 డాలర్లకు క్షీణించింది.నిజానికి,భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది.ఇ-గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా,పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: