జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు తప్పలేదు. నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండే ఆర్టిస్టులకు శారీరక అనారోగ్యాలు మామూలే. అందులోను పవర్ స్టార్ పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కదా ? అందుకనే వెన్నుపోటు మొదలైందట. అంటే పాలిటిక్స్ లో పవన్ పెద్దగీ పీకిందేమీ లేదు లేండి. పీకినా పీకకపోయినా పర్యటనలు, సమావేశాలు, బహిరంగ సభలైతే తప్పవు కదా .

 

సరిగ్గా వాటి వల్ల పవన్ వెన్నునొప్పి తిరగబెట్టిందట. ఆ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణే చెప్పుకున్నారు. దాంతో ఆ విషయం వైరల్ గా మారింది.  విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశానికి పవన్ హాజరు కావాల్సుంది. అయితే దానికి హాజరుకాని పవన్ ఓ లేఖను రిలీజ్  చేశారు.

 

ఆ లేఖలో తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో వెన్నుకు తీవ్ర గాయమైందట. ఆ గాయం తాలూకు నొప్పి చాలా తీవ్రంగా ఉండేడట. ఈ మధ్య వెన్నునొప్పికి సరైన వైద్యం చేయించుకోని కారణంగా అంటే నిర్లక్ష్యం కారణంగా వెన్నునొప్పి తిరగబెట్టిందట.

 

ఈమధ్య వెన్నునొప్పి ఎక్కువయిపోవటంతో బయటకు రాలేకపోతున్నారట. అందుకనే రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. పవన్ నుండి తన అనారోగ్యం విషయంలో బహిరంగ లేఖ విడుదలవ్వటంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు.

 

ఏదేమైనా మామూలుగానే పవన్ ఒకరోజు పర్యటన చేస్తే మళ్ళీ పదిరోజులు ఎక్కడా అడ్రస్ ఉండరన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే బొత్తిగా ఓపిక తక్కువ. ఇంతోటిదానికి తాను జనాల్లోకి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తుందని, తన అభిమానులు తనమీద పడిపోతారని, వాళ్ళని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదంటూ చాలా కతలే వినిపించారు. దానికి తోడు ఇపుడు అనారోగ్యం కూడా అంటే రాజకీయంగా ఇబ్బందే. ఎందుకంటే తొందరలో స్ధానిక సంస్ధల ఎన్నికలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయాలంటే పవన్ కు ఎలా ?


మరింత సమాచారం తెలుసుకోండి: