రోజురోజుకు నెట్ వియోగదారులు పెరిగిపోతున్నారు.  నెట్ చౌకగా లభించడంతో పాటు, ఫోన్ లుడా చౌకగా లభిస్తుండటంతో.. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతున్నది. దీనిపై ఇటీవలే ఓ సర్వే జరిగింది.  ఈ సర్వే ప్రకారం నెట్ ను అత్యధికంగా వినియోగిస్తున్న వారిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానంలో ఉండటం విశేషం.  అటు జనాభా పరంగా కూడా చైనాది మొదటి స్థానం కాగా, ఇండియా రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.  


ఇక  ఇదిలా ఉంటె, నెట్ వినియోగించే వారిలో పురుషులు ఎక్కువుగా ఉన్నారు.  మహిళలు నెట్ ను చాలా తక్కువగా వినియోగిస్తున్నట్టు సర్వేలో వెల్లడయింది.  దేశంలో 258 మిలియన్ మంది మహిళలు నెట్ ను వినియోగిస్తున్నారట. అంతేకాదు, 11 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎక్కువగా నెట్ ను వియోగిస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి.  ఈ సంఖ్య దాదాపు 6.6 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.  


ఇక నగరాలు, పట్టణాల మధ్య తేడా కూడా ఉన్నది.  నగరాల్లో రోజుకు 139 మిలియన్ మంది నెట్ ను వినియోగిస్తుంటే, గ్రామాల్లో 109 మిలియన్ మంది నెట్ ను వినియోగిస్తున్నారు.  గ్రామాల్లో రోజుకు 15 నుంచి 30 నిమిషాల మేర నెట్ వినియోగం జరుగుతున్నది.  చౌకగా నెట్ అందుబాటులోకి రావడమే ప్రధానకారణం.  జియో వంటి సంస్థలు అతి తక్కువ ధరకు డేటాను అందజేస్తుండటంతో ఈ సంఖ్య పెరిగిపోతున్నది.  


క్రమంగా ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.  ఇదే జరిగితే.. దాని వలన వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్నికావు.  నెట్ వినియోగం ఎక్కువుగా ఉంటె..దానివలన జరిగే పర్యవసానం వేరుగా ఉంటుంది.  ఇక నగరాల వారిగా పరిశీలిస్తే ముంబై నగరంలో 11.7 మిలియన్ మంది, ఢిల్లీలో 11.7 మిలియన్ మంది, బెంగుళూరు 6.1 మిలియన్ మంది, కోల్ కతా 6.1 మిలియన్ మంది చెన్నై 5.4 మిలియన్ మంది నెట్ ను వినియోగిస్తున్నట్టు సర్వే చెప్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: