గత కొన్ని రోజులుగా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  ఉదయం ఎండగా కనిపిస్తున్న సాయంత్రం అయ్యే సరికి వాతావరణం మారిపోతున్నది.  రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  అది కుండపోతగా వర్షం కురుస్తున్నది.  దీంతో రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయి.  ఇలా ప్రతి రోజు వర్షం కురుస్తున్న కారణంగా జనజీవనం ఇబ్బందులు పడుతున్నది.  రాత్రి సమయంలో తెలియడం లేదు.  


కానీ, ఉదయం సమయంలో కూడా మబ్బులు పడుతున్నాయి.  మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  బయటకు వచ్చేందుకు సాహసం చేయలేకపోతున్నారు.  బయటకు వస్తే ఎలాంటి ఇబ్బంది వస్తుందో.. ఎక్కడ చిక్కుకుపోతామో అనిఆలోచిస్తున్నారు .  రాత్రి నగరంలో 10 సెంటీమీటర్లమేర వర్షం కురిసింది.  


రాత్రి 11 గంటల సమయంలో మొదలైన ఈ వాన, తెల్లారే వరకు కురుస్తూనే ఉన్నది.  గుడిమల్కాపూర్ లో అత్యధికంగా 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  రాత్రివేళ ఉద్యోగానికి వెళ్లేవారు.  రాత్రివేళ తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తులు పాపం చాలా ఇబ్బందులు పడ్డారు.  అటు పోలీసులు, డిజాస్టర్ టీమ్ సభ్యులు నగరంలో అత్యవసర సహాయం అందిస్తున్నారు.  


గుడిమల్కాపూర్ లో 14.3, రెడ్ హిల్స్ లో 13.3, ఖైరతాబాద్ లో 12.7, మోండా మార్కెట్ లో 10.7, కార్వాన్ లో 10.4, నాంపల్లిలో 9.9, అసిఫ్ నగర్ లో 9.8, శ్రీనగర్ కాలనీలో 9.5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఈస్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు నాగా అగచాట్లు పడుతున్నారు.  ఒకవైపు జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు వర్షం కూడా ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది.   గత 111 సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి అని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొన్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: